Movies

వంటలక్క రియల్ లైఫ్ చూస్తే మతిపోవాల్సిందే..? ఆమె భర్త ఎవరో తెలుసా..?

ప్రేమి విశ్వనాధ్ తొలుత మలయాళంలో కారుముత్తు అనే సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైంది. ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్‌ని తెలుగులో కార్తీక దీపం పేరుతో నిర్మించారు. కార్తీకదీపం సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులు దాదాపు ఉండరు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉన్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.

ఈమె 1991 డిసెంబర్ 2లో కేరళ లోని ఎర్నాకుళం లో జన్మించింది. దీప తండ్రి విశ్వనాధ్. తల్లి కాంచన, సోదరుడు శివ ప్రసాద్. ఏ హీరోయిన్ అయినా తన మేనిఛాయను మరింత మెరుపులు తగిలించుకొని తెల్లగా కనిపించాలని తాపత్రయపడతారు. కానీ ప్రేమి విశ్వనాధ్ అందం అంటే తెలుపు కాదని నలుపు వర్ణం ముఖానికి పులుముకొని తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రేమి విశ్వనాధ్ తొలుత మలయాళంలో కారుముత్తు అనే సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైంది. ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్‌ని తెలుగులో కార్తీక దీపం పేరుతో నిర్మించారు. అటు మలయాళం సీరియల్ లోను ఇటు తెలుగు సీరియల్ లోను నటించి ప్రేక్షకుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది ప్రేమి విశ్వనాధ్.

ఇక ప్రేమి విశ్వనాధ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే…ఆమె భర్త పేరు టియస్ వినీత్ భట్ ఆయన ప్రపంచంలో అత్యుత్తమ జ్యోతిష్యుడు కావడం విశేషం. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డు అందుకున్నారు. ఆయన క్లయింట్స్ దేశంలోని ప్రముఖ రాజకీయ, సినిమా ప్రముఖులు ఉండటం విశేషం.