Movies

ఎన్టీఆర్ చెప్పిన వినకుండా ఆ తప్పు చేసి 10 సంవత్సరాలు సినిమాకు దూరం అయిన గీతాంజలి

రెండు తెలుగు రాష్ట్రాలకు టాలీవుడ్ పరిశ్రమలో మొట్టమొదటి సీతగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసిన నటి గీతాంజలి. 400 సినిమాల్లో నటించిన గీతాంజలి సహా నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలం సినిమాల్లో నటించిన 1972 లో ‘కాలం మారింది’ సినిమా తర్వాత సినిమాలకు దూరం అయిందనే చెప్పాలి. పెళ్లి అయ్యాక గీతాంజలి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గీతాంజలి,రామకృష్ణ దంపతులకు శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. 10 సంవత్సరాలు సినిమా పరిశ్రమకు దూరం అవ్వటానికి కూడా ఒక కారణం ఉందట. ఒక కన్నడ సినిమాను చూసిన గీతాంజలి ఎలాగైనా ఆ సినిమా రీమేక్ హక్కులను కొనాలని తన భర్త రామకృష్ణకు చెప్పారట. చాలా బలవంతం కూడా చేశారట. ఇక గీతాంజలి పోరు పడలేక ఆ కన్నడ సినిమా హక్కులను కొని తెలుగులో రామాపురంలో సీత అనే పేరుతొ తీశారు.

ఆ సినిమాలో చంద్రమోహన్ ,సుజాత,రామకృష్ణ నటించారు. ఈ సినిమా గురించి గీతాంజలి సీనియర్ ఎన్టీఆర్ కి చెప్పగా ఈ సినిమాను నిర్మించవద్దని చెప్పారట. అలాగే సినిమా ప్రారంభానికి పిలిచినా ఎన్టీఆర్ రాలేదట. ఈ సినిమా కోసం ఆ రోజుల్లో అంటే 1981 లో 25 లక్షలు ఖర్చు పెట్టారు గీతాంజలి,రామకృష్ణ. సినిమా ఘోర పరాజయం పొందటంతో చాలా కాలం వరకు గీతాంజలి వెండితెర వైపు చూడలేదు. ఎంత మంది అవకాశాలు ఇచ్చిన సరే రామాపురంలో సీత సినిమా మిగిలిచిన విషాదంతో సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో సినిమాతో బామ్మా పాత్రతో ఎంట్రీ ఇచ్చింది గీతాంజలి. ఆమె చివరి సినిమా that is mahalakshmi. గీతాంజలికి కొడుకుని హీరోగా చూడాలని ఆశ. కొడుకు నటించిన ఒక్క సినిమా ప్లాప్ అవ్వటంతో గీతాంజలి కోరిక తీరలేదు. కొడుకు శ్రీనివాస్ కూడా సినిమా ప్లాప్ అవ్వటంతో సినిమాలకు దూరంగానే ఉన్నాడు.