వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామి ని ఎందుకు దర్శించుకుంటారు
తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవటం చూస్తూనే ఉంటాం.అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం.కానీ దానికి గల కారణం తెలియదుమనకే కాదు మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. ఇప్పుడు ఆ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.
సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశారు. అప్పటివరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.అప్పటిలో వరాహస్వామి శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు. వెంకటేశ్వరస్వామి.దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు. వరాహస్వామికి.అదేమిటంటే… తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని చెప్పాడు.తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి స్థలం ఇవ్వటం వలన వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగి పత్రం మీద రాసి ఇచ్చారు వెంకటేశ్వర స్వామి.ఈ రాగి రేకును అర్చన తీసుకున్న భక్తులకు ఇప్పటికి చూపిస్తారు.
https://www.chaipakodi.com/