కోయిలమ్మ సీరియల్ చిన్ని గురించి మీకు తెలియని చాలా విషయాలు
కోయిలమ్మ సీరియల్‌లో సింగర్ పాత్రలో నటిస్తున్న తేజస్వి.. తెలుగులో ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. స్వతహాగా సింగర్ కావడంతో కోయిలమ్మ సీరియల్‌లోనూ తేజస్వి తన సొంత గొంతుతో పాటలు పాడుతున్నారు. సినిమా హీరోలు,హీరోయిన్లకే కాదు.. సీరియల్స్ నటీనటులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్‌తో ‘దీప’,కోయిలమ్మ సీరియల్‌తో ‘కోకిల చిన్ని’ అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో సహజంగానే వారి నేపథ్యం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో కోయిలమ్మ సీరియల్ నటి కోకిల చిన్ని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కోకిల చిన్ని అసలు పేరు తేజస్వి గౌడ. ఆమె తల్లిదండ్రులు మల్లిఖార్జున-భ్రమరాంభ. ఐదేళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోయాడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన తేజస్వి గౌడ.. బెంగళూరులోని మ్యాక్స్ ముల్లర్ హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఈసీఈ పూర్తి చేశారు. తేజస్వి గౌడకు చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి ఉండటంతో.. తల్లిదండ్రులు ఆమెను ఆవైపు ప్రోత్సహించారు. ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత కొన్నేళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన తేజస్వి.. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్ వైపు వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెకు కోయిల సీరియల్ ఆఫర్ రావడంతో కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగినట్టయింది.కోయిలమ్మ సీరియల్‌లో సింగర్ పాత్రలో నటిస్తున్న తేజస్వి.. తెలుగులో ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
స్వతహాగా సింగర్ కావడంతో కోయిలమ్మ సీరియల్‌లోనూ తేజస్వి తన సొంత గొంతుతో పాటలు పాడుతున్నారు. తెలుగు కంటే ముందు బిలి హెండ్తి అనే కన్నడ సీరియల్ ద్వారా ఆమె బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. చేసిన రెండో సీరియల్‌తోనే కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్వి నిజంగా లక్కీ గాళ్ అనే చెప్పాలి.