Movies

ఈ నటుడు గుర్తున్నాడా… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూస్తే కన్నీళ్లు ఆగవు

విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకరన్ మూవీలో విలన్ గా చేసి మంచి పేరు తెచ్చుకుని దక్షిణాది భాషల్లో నెంబర్ వన్ విలన్ గా గుర్తింపు పొందిన మున్సూర్ అలీఖాన్ 250చిత్రాల్లో నటించాడు. తన పాత్రల ద్వారా తనకంటూ ఓ శైలి ఏర్పరచుకున్నాడు. తెలుగు,మలయాళం,కన్నడం మూవీస్ లో కూడా చేసిన యితడు ఆతర్వాత రచయితగా, దర్శకుడిగా,నిర్మాతగా కూడా పేరుతెచ్చుకున్నాడు. రుద్ర పంగలి, హైజాక్ ,పిస్తా,సింగం 2, పారై,వంటి ఎన్నో తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన నటనతో మెప్పించాడు.

ముఠామేస్త్రి,నాయుడమ్మ,వంటి తెలుగు మూవీస్ లో నటించిన మున్సూర్ అలీఖాన్ తన కొడుకుని హీరోగా పెట్టి తానే డైరెక్టర్ గా కాలమం పారై మూవీ చేసాడు. తమిళంతో పాటు తెలుగు,మలయాళం,కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ చేసారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా చేరి,గత లోకసభ ఎన్నికల్లో దిండిగల్ స్థానం నుంచి ఎంటికే తరపున పోటీచేసి ఓటమి చెందాడు.

ఈవీఎం లను టాంపరింగ్ చేయడం వల్లనే తాను ఓడిపోయానని మీడియాలో వైరల్ అయిన మున్సూర్ అలీఖాన్ సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసాడు. ఈవీఎం లను ఎలా టాంపరింగ్ చేయొచ్చో ప్రత్యక్షంగా చూపిస్తామని చెప్పుకొచ్చాడు. ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అతడు వేసిన పిటిషన్ ని సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వివాదం కూడా సమసిపోయింది. దీంతో సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ అయ్యాడు.