Business

మైసూర్ శాండిల్ సోప్ సక్సెస్ స్టోరీ…. తెలిస్తే షాక్

మనం నిత్యం స్నానానికి వాడే సబ్బుల్లో కొంచెం ఖరీదైన సబ్బుల్లో ముఖ్యమైన సబ్బు మైసూర్ శాండిల్ సోప్. దీనివెనుక చాలా పెద్ద కథే ఉంది. క్లుప్తంగా పరిశీలిస్తే,1916లో మైసూర్ ని రాజా కృష్ణ వడయార్ పాలించేవారు. చందన ఎగుమతుల్లో అప్పటికే మైసూర్ ప్రసిద్ధి గాంచింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధానంతరం యూరప్ దేశాల్లో పంటలు పండే ప్రాంతాలు దెబ్బతినేసి,తిండి కూడా లభ్యంకాని దుస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో మైసూర్ లో చందన ఎగుమతులు ఆగిపోయాయి.

ఎగుమతులు ఆగిపోవడంతో ఉపాధి కోల్పోవడం, ప్రభుత్వానికి నష్టం కూడా వచ్చేసింది. ఇది గమనించిన రాజా కృష్ణ వడయార్ చందనం నుంచి వచ్చే నూనెతో సబ్బుల ఫ్యాక్టరీని బెంగుళూరు సమీసంలో పెట్టారు. దాంతో మైసూర్ శాండిల్ సబ్బులు వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చేసింది. మంచి లాభసాటి అయింది. వరల్డ్ లో నూరుశాతం శాండిల్ ఉడ్ తో తయారయ్యే సబ్బుగా దీనికి ప్రసిద్ధి.

ఇక 1980నుంచి మరో కంపెనీతో భాగస్వామ్యం కావడం వలన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ గా మారింది. మైసూర్ శాండిల్ సబ్బుపై కనిపించే లోగో శరభ గా వ్యవహరిస్తారు. భయానికి ,శ్రద్ధకి, చదువుకి శరభ సంకేతంగా భావిస్తారు. అయితే అనుకోకుండా లాభాల నుంచి నష్టాలలోకి వెళ్లిపోయిన ఈ కంపెనీ ఉనికి సైతం కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. దీంతో కార్మికులే దీన్ని నడిపిస్తూ, ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తే,వారికి గోల్డ్ కోయిన్ ఇచ్చేవారు. కార్మికులు తలచుకుంటే నష్టాలనుంచి లాభాల వైపు మళ్లించవచ్చని నిరూపించారు. ఇలా లాభాల బాట పట్టిన ఈ కంపెనీకి 2006లో ధోని బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.