Movies

హీరో రోహిత్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? అతని భార్య ఏమి చేస్తుందో తెలుసా?

సినీ రంగంలో ఎందరో నటీ నటులు రాణిస్తున్నారు. అయితే కొందరు అర్ధాంతరంగా కనుమరుగైపోతారు. హిట్స్ కొట్టినప్పటికీ ఆతర్వాత ఛాన్స్ లు లేక,సినిమాలు ఆడక ,ఇలా వివిధ కారణాలతో సినీ రంగానికి దూరం అయిపోతారు. ఇక కొందరు హీరోలు వరుస ప్లాప్ లతో బయట ప్రపంచానికి కనిపించకుండా పోతారు. ఏది ఏమైనా హీరోల వ్యక్తిగత జీవితాలకు,సినీ జీవితంలోనే ముడిపడి ఉంటుందని చెప్పవచ్చు. కెరీర్ బాగోలేకపోతే ఆ ప్రభావం కూడా వ్యక్తిగత జీవితంపై పడిపోతుంది.

అయితే ఇలాంటి సమయంలో భర్తలకు తోడుగా నిల్చిన భార్యలు చాలామంది ఉన్నారు. ఇక 6 టీన్స్ మూవీతో అందరినీ ఆకట్టుకున్న హీరో రోహిత్ ఆతర్వాత చాలా సినిమాలే చేసాడు. కీలుగుఱ్ఱం లాంటి సినిమాలు చేసాడు. డజను సినిమాలు దాకా చేసినా పెద్దగా గుర్తింపునకు నోచుకోలేక పోయాడు. దీనికి తోడు ఛాన్స్ లు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. సినిమాల్లో ,అలాగే బిజినెస్ ల పేరిట డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పులపాలయ్యారు.

ఇక పెళ్ళిచేసుకోవాలని రోహిత్ అనుకుంటే ఎవరూ ముందుకు రాలేదట. చివరికి ఒక అమ్మాయి వచ్చింది. తాను సినిమా రంగంలో నిలదొక్కుకోలేక పోయానని,తన దగ్గర డబ్బులు లేవని,పెళ్లి చేసుకున్నాక నీ డబ్బులు నీవే సంపాదించుకోవాలని,తాను జోక్యం చేసుకోనని .. ఇలా ఆ అమ్మాయికి అన్నీ చెప్పేశాడట. అయితే నెలరోజులు గమనించాక పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆ అమ్మాయి మొత్తానికి పెళ్లి చేసుకుంది. ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి తన భార్య కారణమని చెప్పుకొచ్చాడు. త్వరలో వెండితెరపై మెరవబోతున్నాడు. ఇక అతడి భార్య చాలా అందగత్తె కావడంతో చూపు తిప్పుకోలేం అని చెబుతున్నారు చాలామంది.