ఒకప్పటి స్టార్ నటుడు జగయ్య మనవడు కూడా మనం రోజు చూస్తున్న బుల్లితెర నటుడు
తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లతో నటించిన అలాంటి మేటి నటుడు,అద్భుతమైన గొంతుతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్న కొంగర జగ్గయ్య అంటే డైలాగ్స్ చెప్పడంలో తనకు తానె సాటి అనిపించుకున్నారు. 1926డిసెంబర్ 31న జన్మించిన ఈయన నాటక రంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి,ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగుపెట్టి ,తన సత్తా చాటారు.
కళా వాచస్పతి బిరుదుని కూడా సొంతం చేసుకున్న జగ్గయ్య హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోవడమే కాదు,డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్రవేశారు.దాదాపు 500కి పైనే సినిమాల్లో నటించి,మంచి గుర్తింపు తెచ్చుకున్న జగ్గయ్య ఏ పాత్ర వేసినా అందులో లీనమయి న్యాయం చేకూర్చారు. ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ ల కొడుకులు,మనవలు కూడా సినీ రంగంలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.
అయితే జగ్గయ్య వారసత్వం ఏమైపోయిందని అందరూ ఆశ్చర్య పోతుంటారు. కానీ ఆయన వారసత్వం నటనా రంగంలో విరాజిల్లుతోంది. అవును,జగ్గయ్యకు ఇద్దురు కొడుకులు,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు నలుగురిలో ఎవరూ సినీ రంగంలో లేరు. అయితే మనవడు సాత్విక్ కృష్ణ మాత్రం జగ్గయ్య వారసత్వంగా ఎంట్రీ ఇచ్చాడు. సాత్విక్ స్వయానా జగ్గయ్య అన్నకు మనవడు. సొంత కొడుకులు,కూతుళ్లు,,మనవాళ్లు సినీ రంగంలోకి రాకపోయినా సాత్విక్ ముందుగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు స్వాతి చినుకులు, మధుమాసం వంటి సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.