ఒకప్పుడు ఎవరు గుర్తు పట్టని తారలు…. ఇప్పుడు ఫుల్ బిజీ…!
సినీ ఇండస్ట్రీలో అమాంతం స్టార్ హీరోలుగా రావడం బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లకు చాలా కష్టం. చిన్న చిన్న పాత్రలు వేస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఆలాంటివాళ్లలో రవితేజ ఒకడు. అల్లరిప్రియుడు,నిన్నే పెళ్లాడతా,సింధూరం,సీతారామరాజు తదితర చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలు వేసాడు. ఆతర్వాత శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘నీకోసం’మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత మాస్ మహారాజాగా ఎదిగారు. ఇక స్టార్ హీరోయిన్ త్రిష జోడీ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ కేరక్టర్ వేసింది. వర్షం లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ హీరోయిన్ గా ఈ బ్యూటీ రాణిస్తోంది. ప్రేమిస్తే మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన శరణ్య ఇప్పుడు హీరోయిన్ గా మారి,సినిమాలు చేస్తోంది.
అలాగే సంబరం మూవీలో ఒకే ఒక్క షాట్ లో కనిపించిన నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో క్లిక్ అయ్యాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. జబర్దస్త్ లో మెరిసిన అనసూయ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసేది. సొంతం మూవీలో ఒక్క షాట్ లో కనిపించిన ఈ బ్యూటీ ఆతర్వాత కీలక రోల్స్ చేస్తోంది. కరెంట్,హోలీ వంటి చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వేసిన రష్మీ టెలివిజన్ రంగంలో పాపులర్ అయింది. విభిన్న కథలతో హీరోగా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. అనుకోకుండా అనే యూట్యూబ్ ఫిలిం తో గుర్తింపులోకి వచ్చిన రీతూ వర్మ ఎవడె సుబ్రహ్మణ్యం,బాద్షా వంటి మూవీస్ లో చిన్న క్యారెక్టర్స్ చేసింది. పెళ్లిచూపులు మూవీతో హీరోయిన్ గా మారి ఇప్పుడు తెలుగు ,తమిళ భాషల్లో దూసుకెళ్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ చిన్న పాత్ర వేసిన శర్వానంద్ ఆతర్వాత వెన్నెల ,గౌరీ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. గమ్యం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లో చిన్న క్యారెక్టర్ చేసిన నవీన్ పోలిశెట్టి ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో హీరోగా మారాడు. కామెడీ ఆర్టిస్ట్ సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్స్ , కామెడీ క్యారెక్టర్స్ చేసి,మర్యాద రామన్న మూవీతో హీరోగా ఎదిగి హిట్ కొట్టాడు. ప్రేమ్,ఇష్క్ ,జులాయి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన శ్రీముఖి ఇప్పుడు టివిలో స్టార్ యాంకర్ గా రాణిస్తోంది.