Movies

నలభై ఏళ్లుగా దాగి ఉన్న మరో చరిత్ర సినిమా రహస్యం

అప్పటికే 50ఏళ్ళు దాటిన ఆత్రేయ,ఎం ఎస్ విశ్వనాథన్ లు సృష్టించిన ‘భలే భలే మగాడివోయ్ బంగారు నాసామిరోయ్’పాట1970దశకంలో యువతను ఓ ఊపు ఊపేసింది. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మరోచరిత్ర సినిమాలో ఈ పాటకు ఇప్పటికీ ఉన్న ప్రాధాన్యత చెప్పలేనిది. నేచురల్ స్టార్ నాని హీరోగా తీసిన భలే భలే మగాడివోయ్ సినిమాకు మరోచరిత్ర సినిమాలో పాటకు పల్లవి ఆధారం. అందుకే సినిమా ప్రారంభంలో అత్ర్రేయ,ఎం ఎస్ విశ్వనాథన్ లకు కృతజ్ఞతలు చెప్పారు.

బాలచందర్ డైరెక్ట్ గా తెలుగులో తీసిన మూవీ మరోచరిత్ర. అయితే తమిళంలో కన్నదాస్ తో రాయించుకోవడం బాలచందర్ కి అలవాటు. అందుకే తెలుగులో అయితే కన్నదాస్ కి అనుగుణంగా ఆత్రేయ రాసేవారు. మరోచరిత్ర సినిమాకు మాత్రం విచిత్ర పరిస్థితి. అన్ని పాటలు ఆత్రేయ రాయాల్సి వచ్చింది. భలే భలే మగాడివోయ్ పాటను తెలుగు ఇంగ్లీషులలో నడపాలని బాలచందర్ అనుకున్నారు. అయితే తెలుగు రాస్తా ఇంగ్లిష్ మాత్రం రాయనని,వేరేవాళ్లతో రాయించుకోండని చెప్పేసారు. అనుకున్న మేరకు తెలుగు ఆత్రేయ రాసారు. ఈ పాట బానే ఉంది మరి ఇంగ్లీషు పదాలు ఎవరి చేత రాయించాలని బాలచందర్ ఆలోచిస్తుంటే రాండర్ గై పేరు తట్టింది.

హిందీ పత్రికలో సినిమాలపై పరిశోధనాత్మక కథనాలు రాసే రాండర్ గై కథనాలు సంచలనం రేపాయి. హిందీలోనే కాదు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కూడా జర్నలిస్ట్ గై వ్యాసాలు ఆకట్టుకునేవి. ఆత్రేయకు ధీటుగా ఇంగ్లీషు పొయిట్రీ రాయమనడంతో సరేనంటూ ‘ఐ డోంట్ నో వాట్ యు సే – బట్ ఐ హావ్ సో మచ్ టు సే’అని రాయడంతో ఒకే అయింది. రాండర్ గై అసలు పేరు మాడభూషి రంగ దురై. ఈయన మద్రాసు యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు.

ప్రవృతి రీత్యా జర్నలిస్ట్,కళాకారుడు. కొద్దికాలం ప్రాక్టీస్ చేసి,రచన రంగానికి అంకితమవ్వాలని భావించారు. అమెరికన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రాంక్ రస్సెల్ కాప్రా మీద రాసిన వ్యాసాన్ని యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కొనుగోలు చేయడంతో ఆయన ఖ్యాతి అమాంతం పెరిగింది. బిఎన్ రెడ్డి మోనోగ్రాఫ్ కూడా ఈయన రాసారు. మోసగాళ్లకు మోసగాడు మూవీని ట్రెజర్ హంట్ పేరిట ఇంగ్లిష్ లో డబ్ చేసినపుడు డబ్బింగ్ డైలాగులు రాండర్ గై రాసారు.