Movies

చేతులారా కెరీర్ ని నాశనం చేసుకుంటున్న కమెడియన్స్

సినిమా జీవితం కూడా వైకుంఠ పాళీ లాంటిదే. ఎప్పుడు ఎదుగుతారో ఎప్పుడు పడిపోతారో తెలీదు. అందుకే నటీనటులు తమకు ఏది నప్పుతుందో ఆ పరిధిలో చేస్తూ వెళ్లాలని అంటూంటారు. అయితే ఈ సూత్రాన్ని మర్చిపోయి కమెడియన్స్ హీరోలుగా మారిపోయి వీరలెవెల్లో ఊహించుకుంటూ,కెరీర్ కి బ్రేకులు వేసుకుంటున్నారు. ఒక్కప్పుడు అలీ హీరోగా వేసినా,ఇది శాశ్వతం కాదని గ్రహించి,మళ్ళీ కామెడీ ట్రాక్ పట్టాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ మాత్రం హీరో రోల్ పేరు చెబితే పారిపోతున్నారు. అయితే కొందరు హీరోలు అయిపోవాలని తెగ ఉబలాటపడిపోతూ కెరీర్ దెబ్బతీసుకుంటున్నారు.

మరో కమెడియన్ సునీల్ కూడా హీరోగా మారిపోయి సినిమాలు చేసినా సక్సెస్ అంతగా రాలేదు. సిక్స్ పాక్ కూడా పెంచుకుని ఆడియన్స్ లో నెగెటివ్ తెచ్చుకున్నాడు. ఇలా తన కెరీర్ విషయంలో చాలా ఆలస్యం చేయడంతో కొంత దెబ్బతిన్నాడు. అయితే హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్నందున నిలదొక్కుకోడానికి ఇంకా ఛాన్స్ వుంది. అయితే కొందరు మాత్రం నేలవిడిచి సాముచేస్తున్నారు. అందులో శ్రీనివాస రెడ్డి ఒకరు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఏవేవో ప్రయోగాలు చేసి, దెబ్బతిన్నాడు. షకలక శంకర్ ఒకడు. యితడు హీరో అవతారం ఎత్తడమే ఓ విడ్డూరం. శంభో శంకర గురించి ఇతను ఎంతచెప్పాడో అంతగా ప్లాప్ అయింది.

అయినా వెనక్కి తగ్గకుండా,డ్రైవర్ రాముడు,నేనే కేడి నెంబర్ వన్ అని దిగాడు. రెండో సినిమా వచ్చినా వచ్చినట్టే లేదు. ఇక మరో కమెడియన్ సప్తగిరి తన కెరీర్ ని తుంగలో తొక్కుకుంటున్నాడు. కమెడియన్ గా ఏడాదికి పదేసి సినిమాలు చేసే యితడు హఠాత్తుగా హీరో అయిపోవాలని ఊగిపోయి,సప్తగిరి ఎల్ ఎల్ బి తో హీరో అయ్యాడు. ఇక ఆతర్వాత కమెడియన్ గా మారినా ఛాన్స్ లు దక్కడం లేదు. అలాగే రంగస్థలం మహేష్ కూడా హీరో అయిపోవాలని నేను నా నాగార్జున అనే సినిమాలో హీరోగా చేసేస్తున్నాడు. ధనాధన్ ధనరాజు జబర్దస్త్ వదిలేసి కమెడియన్ సినిమాల్లోకి వచ్చి,ఇప్పుడిప్పుడే హీరో అనే స్టార్ డమ్ నుంచి బయట పడుతున్నాడట.