Movies

కళాతపస్వి’ K.విశ్వానాథ్ గారి కూతురు కూడా మనందరికీ తెలిసిన టాలీవుడ్ నటి

సినీ ఇండస్ట్రీలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిల్చి ఎన్నో కళాత్మక చిత్రాలు అందించిన వ్యక్తి అనగానే ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ అందరికీ గుర్తొస్తారు. తెలుగు లోగిళ్ళలో ఆత్మీయతలు,అనురాగం,సున్నితమైన భావాలు, సమాజంలో కళాత్మక విలువలు, ఇలా ఎన్నో అంశాలను తన సినిమాల్లో చూపించారు. సామజిక అంశాలతో ముడిపెట్టి ఆయన తీసిన సినిమాలు ఆదర్శంగా నిలిచాయి.

చిన్న చిన్న భావాలను కళ్ళతో పలికించేలా చేయడంలో దిట్ట. ఈయన సినిమాల్లో నటించాలంటే పెట్టిపుట్టాలని అంటారు. ఎప్పుడు నటించాలా అని ఎదురుచూస్తారు. ఈయన ప్రతి సినిమా ఆణిముత్యమే. ఇప్పటికే బుల్లితెరమీద ఈయన సినిమాలను జనం చూస్తూనే ఉంటారు. అంతగా జన హృదయాల్లో నిలిచాయి. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం,స్వాతి కిరణం, స్వయం కృషి,ఆపద్భాందవుడు, ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ ఆణిముత్యాలే.

నటుల్లోని నటనా ప్రతిభను వెలికితీయగల ఇలాంటి దర్శక దిగ్గజం వారసులు ఇండస్ట్రీలో లేరని అందరూ విచారిస్తుంటారు. అయితే విశ్వనాధ్ తమ్ముడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,చంద్రమోహన్ ఇండస్ట్రీలో మంచి రేంజ్ లోనే ఉన్నారు. అయితే విశ్వనాధ్ కూతురు కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే. అవును ఆయన తీసిన సప్తపది మూవీలో నటించిన సబిత నిజంగా విశ్వనాధ్ కి కూతురు వరసే అవుతుంది. నెమలికి నేర్పిన నడకలివి పాట ద్వారా కళ్ళతో హావభావాలు పలికించిన ఈమె ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సినిమా రంగానికి దూరమైంది.