Movies

ప్రోజెన్‌ 2 కు సితార తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.ఆమెకు సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉన్న విషయం తెల్సిందే.సితారను నెటిజన్స్‌ ముద్దుగా సీతుపాప అంటూ ఉంటారు.మహేష్‌బాబు కూడా తన కూతురు విషయాన్ని చెప్పాలంటూ సీతూ పాప అంటూ ఉంటాడు.చాలా క్యూట్‌గా అందంగా ఉండే సితార ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది

ప్రస్తుతం సీతూ పాప హాలీవుడ్‌ మూవీ ప్రోజెన్‌ 2కు ప్రమోషన్‌ చేస్తోంది.తెలుగులో డబ్‌ అయిన ప్రోజెన్‌ 2 సినిమాలో బేబీ ఎల్సా పాత్రకు గాను సీతు పాప డబ్బింగ్‌ చెప్పింది.ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.నాకు ఎల్సా అంటే చాలా చాలా ఇష్టం.అందుకే ఎల్సా పాత్ర కోసం నేను డబ్బింగ్‌ చెప్పానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.నా ఇంట్లో నా రూంలో ఎల్సాకు చెందిన బొమ్మలు చాలా చాలా ఉంటాయి.

ఆ అభిమానంతోనే డబ్బింగ్‌ చెప్పాను అంటూ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే సీతూ పాప డబ్బింగ్‌ చెప్పడం వల్ల సినిమాకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.మహేష్‌బాబు కూడా సినిమా గురించి పదే పదే ట్వీట్‌ చేస్తున్న కారణంగా మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.పబ్లిసిటీ మరియు డబ్బింగ్‌ కలిపి పది లక్షల వరకు సీతుపాపకు ఇచ్చి ఉంటారని టాక్‌ వినిపిస్తుంది.బేబీ ఎల్సా పాత్రకు సీతార డబ్బింగ్‌ చెప్తే పెద్ద ఎల్సా పాత్రకు నిత్యామీనన్‌ డబ్బింగ్‌ చెప్పింది.వీరిద్దరి డబ్బింగ్‌తో సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.