Business

కోట్లకు కోట్లు విలువ చేసే MTR సంస్థ,మన టాలీవుడ్ స్టార్ హీరోయిందని తెలుసా ?

ఒకప్పుడు అందానికి అందం,అభినయానికి అభినయం గల స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కృష్ణకుమారి ని సెట్స్ మీద చూస్తుంటే,రెప్ప వాల్చకుండా ఉండేవారట. అంత అందంగా ఉండేదని చెప్పాలి. అలాగని నటనలో కూడా తనకు తానె సాటి. తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగులో 150కి పైగా సినిమాల్లో నటించింది.

ఎన్టీఆర్ ,అక్కినేని లతో కల్సి కృష్ణకుమారి ఎన్నో సినిమాల్లో చేసి,స్టార్ డమ్ సొంతం చేసుకుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె పాతాళభైరవి మూవీతో ఎంట్రీ ఇచ్చింది.ప్రియురాలు,దీపావళి,పెళ్లికానుక,భార్యాభర్తలు,వాగ్దానం,కులగోత్రాలు,చదువుకున్న అమ్మాయిలు,డాక్టర్ చక్రవర్తి,ఇలా ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. తమిళ ,కన్నడ ,భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా 30సినిమాల్లో రాణించిన కృష్ణకుమారి 1960నుంచి 1980వరకూ తెలుగు తెరపై తిరుగులేని నటిగా నిల్చింది.

కెరీర్ బాగున్నపుడే అజయ్ మోహన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆయన ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ ఫౌండర్ ,జర్నలిస్ట్ కూడా. పెళ్ళయాక బెంగుళూరులో స్థిరపడిన ఈమెకు దీపికా అనే ఒక దత్తపుత్రిక ఉంది. సొంత కూతురిలా పెంచి పెద్ద చేసి,మరో బిజినెస్ మ్యాన్ కిచ్చి పెళ్ళిచేసింది. అతడి పేరు విజయకుమార్. గులాబ్ జామ్ పేకెట్స్ నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు అందించే ఎంటీఆర్ సంస్థకు అధినేత. ఇక విషయమేమిటంటే,సినిమాలనుంచి రిటైరయ్యాక ఇంట్లో కూర్చుని ,రెడీ మిక్స్ లాంటివి తయారుచేసి,ఎంటీఆర్ సంస్థకు అందించింది. అవీ ఇప్పుడు పాపులర్ అయ్యాయి. రెడీ గా ఇడ్లి కావచ్చు, దోశలు కావచ్చు ,పాయసం కావచ్చు ఇవన్నీ కృష్ణకుమారి వంట గది నుంచి రూపొందినవే.