Business

యాడ్స్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్స్… సంపాదన ఎంతో తెలుసా?

సినిమాలతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ కమర్షియల్ యాడ్స్ లో అదరగొట్టేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడికి అనుగుణంగా ఫామ్ లో ఉండగానే డబ్బులు సంపాదించి వెనకేసుకోవాలన్న కాన్సెప్ట్ ని బలంగా వంటబట్టించుకుంటున్నారు. ఎందుకంటే సినిమా కెరీర్ ఎపుడు ఎలా ఉంటుందో తెలియని స్థితి. వివిధ కంపెనీల యాడ్స్ లో స్టార్ హీరోలే కాదు,క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు.

అలాంటి వాళ్లలో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు విజయవంతమయ్యాయి. తన నటనతో ఆడియన్స్ ని నవ్వించారు. సినిమాలే కాకుండా క్రేన్ ఒక్కపొడి యాడ్స్ లో నటించారు. అలాగే మాజీ మంత్రి,కమెడియన్ బాబూమోహన్ క్రేన్ వక్కపొడి ప్రమోషన్ చేసారు. నటుడు భానుచందర్,నటి హేమ కల్సి పంట గుళికలు స్ప్రింట్ యాడ్ లో నటించారు. హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం జీలకర్రతో తయారైన మిశ్రమం గ్యాస్ అండ్ ఫాస్ట్ యాడ్ లో నటించాడు. అలాగే సుఖ శాంతి రియల్ ఎస్టేట్ డవలపర్స్ సంస్థకు ప్రమోషన్ చేసాడు.

ప్రముఖ నేపధ్య గాయకుడు,గానగంధర్వ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నటుడిగా కూడా సత్తా చాటుకున్నాడు. విల్ మోర్ అనే యాప్ కి యాడ్ చేసాడు. సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాడు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగనాధ్ నాగార్జున ఫెర్టిలైజర్స్ యాడ్ లో నటించాడు. నీటి మోటరుకి అమర్చే పరికరం ఆగ్రో మోటార్స్ కి కూడా యాడ్ చేసాడు. నటుడిగా,కమెడియన్ గా, హీరోగా విభిన్న పాత్రలతో మెప్పించిన అలీ సెంటర్ ఫ్రూట్ ని ప్రమోట్ చేసారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ కి కూడా ప్రమోషన్ వర్క్ చేసాడు. అంతేకాదు ఓ యాప్ కి అల్లు అర్జున్ తో కల్సి అలీ యాడ్ చేసాడు. కమెడియన్,విలన్,కేరక్టర్ పాత్రలతో మెప్పించి ఆడియన్స్ ని ఫిదా చేసిన నటుడు కోట శ్రీనివాసరావు,స్ప్రైట్ కంపెనీ యాడ్ లో చేసాడు.