Movies

‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ టాప్ హీరో ‘కూతురు’ అని మీకు తెలుసా?

రాజకీయ సినీ రంగాల్లో వారసత్వం పరిపాటి. పెద్ద హీరోల మొదలుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి వారసులు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. హీరోల మనవలు కూడా ఇండస్ట్రీకి వచ్చి ఓ ఊపు ఊపేస్తున్నారు. ఇక ఒకప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,హీరోగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరో శ్రీకాంత్ మొదటిసారిగా ఎన్ కౌంటర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో శ్రీకాంత్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు.

తనతో పాటు హీరోయిన్ గా నటించిన ఊహను ప్రేమించి పెళ్లాడాడు. లేడీ ఫాన్స్ ఎక్కువగా ఉండే శ్రీకాంత్ కి ఇలా పెళ్ళయిపోయిందని తెలియడంతో పెద్ద సంచలనం అయింది. చాలామంది బాధపడ్డారట. పెళ్లయ్యాక ఊహ పెద్దగా సినిమాల్లో నటించలేదు. శ్రీకాంత్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తాజ్ మహల్ మూవీ శ్రీకాంత్ ని హీరోగా చేస్తే,పెళ్లి సందడి మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీతో శ్రీకాంత్ కెరీర్ అనూహ్యంగా మలుపు తిరిగింది.

ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాల హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఖడ్గం మూవీతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వంద సినిమాల్లో హీరోగా చేసాడు. ఇక కాలానుగుణంగా ఇప్పుడు హీరోగానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కూడా ఒదిగిపోతున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోహాన్ నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం నటనలో శిక్షణకు యుఎస్ వెళ్లిన రోహాన్ త్వరలో పూర్తిస్థాయి హీరోగా రాబోతున్నాడు. కూతురు మేథ తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా రుద్రమదేవి సినిమాలో చిన్నప్పటి అనుష్క పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పేరుకు తగ్గట్టు చదువులోనే కాదు,నేషనల్ లెవెల్ వాలీబాల్ ఛాంపియన్ కూడా.