ఆమె శాపమే తరుణ్ కి తగిలిందా? బయటపడ్డ ఎవరికీ తెలియని నిజాలు..!!
సినీ రంగంలో సెన్షేషన్ కోసం కొన్ని వార్తలు స్ప్రెడ్ అవుతాయి. ఇందులో కొన్ని నిజాలున్నా,మరికొన్ని రూమర్స్ గా తేలిపోతాయి. ముఖ్యంగా వరుస పెట్టి హీరో హీరోయిన్స్ గా నటిస్తే చాలు,వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చేస్తాయి. అయితే నాగార్జున,అమల:శ్రీకాంత్ ,ఊహ;పవన్,రేణు దేశాయ్; మహేష్, నమ్రత; సమంత, నాగచైతన్య ఇలా చాలామంది నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు అయ్యారు.
అయితే బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి పెద్ద హీరోగా ఎదిగిన తరుణ్ యంగ్ స్టార్ హీరోగా రాణించి,ఇప్పుడు ఇండస్ట్రీలోనే కనపడకుండా పోయాడు. బాలనటుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని,నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి,ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి,గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మంచి స్టార్ హీరోగా ఉన్న సమయంలో నువ్వులేక నేను లేను సినిమాతో ఆర్తి అగర్వాల్ తో జత కట్టాడు. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో ఆమె తెరంగేట్రం చేసింది.
అయితే తరుణ్ తో కల్సి 10సినిమాల్లో నటించింది. దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. మీడియాలో వీళ్ళ వార్తలే అప్పట్లో హల్ చల్ చేశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని ఇలా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తరుణ్ తల్లి రోజా రమణి,తన కొడుకు,ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకోవడం లేదని బాహాటంగా చెప్పేసింది. అప్పటికే ఎందరో స్టార్ హీరోస్ తో కల్సి నటించిన ఆర్తి ఇండస్ట్రీకి దూరమై,పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కానీ తరుణ్ ని మర్చిపోలేక,అటు భర్తతో మనస్పర్థల కారణంగా పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది.
భర్తతో విడిపోయింది. పెళ్లి తర్వాత ఎవరూ గుర్తుపట్టలేనంతగా లావెక్కిపోయింది. విడాకుల తర్వాత మళ్ళీ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా చేయడానికి సిద్ధపడింది. ఆసమయంలోనే లావు తగ్గడానికి ఆపరేషన్ కి సిద్ధపడి ,అది కాస్తా ఫెయిల్ అవ్వడంతో సడన్ గా కన్నుమూసింది. ఇక ఆర్తి శాపమో ఏమో గానీ తరుణ్ ఆతర్వాత మరి ఏ సినిమాలో కనిపించకుండా పోయాడు.