బన్నీ సినిమా ఫేక్ రికార్డ్స్ కోసం ఇంత ఖర్చు పెట్టారా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. తన మాటల తూటాలతో చప్పట్లు కొట్టించుకునే త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఓ సరికొత్త గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాతో రేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే నిన్ననే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన రెండు వీడియోస్ ఒకేసారి యూట్యూబ్ లోకి రావాల్సి వచ్చింది.దీనితో ఒక్కసారిగా మరోసారి ఇద్దరి అభిమానుల్లో అలజడి మొదలయ్యింది.దీనితో ఇద్దరి అభిమానుల్లో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి.అలాగే మరోపక్క అల వైకుంఠపురములో రెండు సాంగ్స్ కు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా రానంత అద్భుత రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా “సామజవరగమన” మరియు “రాములో రాముల” సాంగ్స్ కు రికార్డు స్థాయి వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి.అయితే వీటి కోసం ఎప్పుడూ రాని టాక్ మరియు గాసిప్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.అల వైకుంఠపురములో సినిమా లిరికల్ వీడియోస్ మరియు ఇతర యూట్యూబ్ సాంగ్స్ కు రికార్డు స్థాయి వ్యూస్ మరియు లైక్స్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో కానీ తాజాగా ఈ అంశం బయటకు వచ్చింది.