“సరిలేరు నీకెవ్వరు”లో హీరోయిన్ లేదా..?
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం హ్యాష్ టాగ్స్ తో అభిమానులు ఊదరగొట్టేస్తున్నారు. అయితే ఒక స్టార్ హీరో సినిమా అంటే మొదట మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం అతని మీదకే వెళ్ళిపోతుంది.అలాగే మన తెలుగులో హీరోయిన్ కు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఇవ్వకుండా వారిని కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితం చేస్తూ నామ మాత్రంగా మా చిత్రంలో ఈ హీరోయిన్ ఉందని చెప్పుకోడానికి తీసుకుంటారు అంతే.ఇప్పుడు అంతకు మించే ఈ “సరిలేరు నీకెవ్వరు” హీరోయిన్ విషయంలో జరుగుతుంది అని చెప్పాలి.
ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ అంతా కేవలం హీరోను ఇతర కీలక పాత్రలను హైప్ చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఉందని మర్చిపోయారో లేక కేవలం హీరో ను చూపిస్తేనే క్రేజ్ వస్తుందేమో అనుకున్నారో కానీ ఇప్పటిదాకా రష్మికా మందన్నా పోస్టర్ కూడా విడుదల చేయకపోగా కనీసం నిన్న చూపించిన టీజర్ లో ఒక్క సెకను షాట్ కూడా పెట్టలేదు.దీనితో అసలు ఈ చిత్రంలో హీరోయిన్ ఉందా లేదా అని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.మరి చిత్ర యూనిట్ ఎందుకు ఇలా చేస్తుందో వారికే తెలియాలి.