సూపర్ స్టార్‌ని డామినేట్ చేస్తోన్న లేడీ సూపర్ స్టార్.!
దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి రీ ఎంట్రీ జరుగుతోంది. రీ ఎంట్రీ మూవీకి ఇంతకన్నా గొప్ప సినిమా ఇంకేముంటుంది.? అనుకున్నారో ఏమో, అడగ్గానే ఒప్పుకున్నారు విజయశాంతి. అందుకు తగ్గట్లుగానే ఆమె పాత్ర చిత్రీకరణ ‘సరిలేరు..’లో అదిరిపోయేలా ఉండబోతోందని ఫస్ట్‌లుక్ ద్వారానే హింట్ ఇచ్చారు. ఇక టీజర్‌తో ప్రూవ్ చేసేశారు. టీజర్‌లో విజయ శాంతిని చూశాక, ఆమె ఆహార్యం, డైలాగ్ డెలివరీ అన్నీ సూపర్ స్టార్‌ని డామినేట్ చేసేలా కనిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్‌ని బాగా వాడుకుంటారు. అందులోనూ విజయ శాంతిలాంటి సీనియర్ టాలెంటెడ్ పర్సన్ దొరికితే, వాడకం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. జస్ట్ శాంపిల్‌గా విజయ శాంతి క్యారెక్టర్ చూపించాడు. ఇక సినిమాలో ఉతుకుడే ఉతుకుడు అని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైతేనేం, సంక్రాంతికి పోటీ పడనున్న అల్లు అర్జున్ ‘అల..’తో సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్‌కి తగ్గట్లే, ‘సరిలేరు మీకెవ్వరూ..’ అనిపించడం ఖాయం. సినిమాలో విజయ శాంతితో పాటు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితర బలమైన పాత్రలుండడం, ప్రతీ పాత్రనూ చాలా జాగ్రత్తగా చిత్రీకరించడంతో సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది ‘సరిలేరు..’ టీమ్.
ఆ కాన్ఫిడెన్స్‌తోనే బన్నీ కన్నా ఒక్క రోజు ముందే ధియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైపోయారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్ ఆక్యుపై చేసేసింది ‘సరిలేరు..’ టీజర్.