సరిలేరు నీకెవ్వరు కూడా కాపీయేనా?
సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు టీజర్‌ను తాజాగా రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ఈ టీజర్‌లో మహేష్ యాక్టింగ్‌కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.అయితే ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో ఎంత ప్రశంసలు వస్తున్నాయో అంతే విమర్శలు కూడా వస్తున్నాయి.
ముఖ్యంగా యాంటీ మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా టీజర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు టీజర్‌లో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించిన తీరు, అటుపై సొసైటీలో జరిగే అరాచకాలను ఎదుర్కొనే అంశం చూస్తుంటే ఈ సినిమాను అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నుండి ఎత్తేసినట్లు పేర్కొన్నారు.
ఆ సినిమాలో కూడా బన్నీ ఆర్మీ పాత్రలో నటించడం, అటుపై సొసైటీలో జరిగే అరాచకాలను అడ్డుకునే తీరును చూపించారు.మొత్తానికి మహేష్ సినిమాను ఏ హాలీవుడ్ లేక ఫారిన్ సినిమా నుండి కాకుండా ఏకంగా తెలుగు సినిమా నుండే ఎత్తేశారు అంటూ విమర్శకుడు సెటైర్లు వేస్తున్నారు.మరి దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి.