Movies

పునర్నవి రేపిన కాంట్రవర్సీకు రాహుల్ ఎండ్ కార్డ్..ఇంతకీ ఏమయ్యింది?

తాజాగా మరోసారి రాహుల్ మరియు పునర్నవిలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.తాజాగా పునర్నవి రాహుల్ పై చేసిన కామెంట్స్ రాహుల్ అభిమానుల్లో రచ్చ లేపాయి.వీరిద్దరూ కలిసి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.అలా తాజాగా టీవీ5 ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.దీనికి సంబంధించిన ప్రోమోలో రాహుల్ ను ఉద్దేశించి పునర్నవి చేసిన కామెంట్స్ రాహుల్ అభిమానులకు నచ్చకపోవడంతో ఆమెపై రాహుల్ అభిమానులు విరుచుకుపడ్డారు.

రాహుల్ ని తక్కువ చేస్తూ అంటావా అంటూ తిడుతూ కామెంట్ చేసిన విషయం ఇప్పుడు రాహుల్ వరకు రావడంతో ఈ కాంట్రవర్సీకు రాహుల్ ఎండ్ కార్డు వేసాడు.పునర్నవి తనను ఎప్పుడూ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని తాను నన్ను ఎప్పుడు ఏదోకటి అలా తిడుతూ ఉంటుందని ఇది కూడా అలాంటిదే తప్పవేరే ఉద్దేశం ఏమి లేదని అన్నాడు.అందువల్ల ఈ విషయాన్ని తన అభిమానులు అర్ధం చేసుకోవాలని అయినా తిట్టడం ఏమిటని కాస్త అసహనం కూడా వ్యక్తం చేసాడు.మరి దీనిని రాహుల్ అభిమానులు అభిమానులు అర్ధం చేసుకున్నారో లేదో..