Movies

సరిలేరు నీకెవ్వరూ,అల వైకుంఠపురంలో ..హైలెట్స్

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి కూడా పరిపాటి. అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతికి పోటీపడుతుంటాయి. అయితే ఈసారి కూడా రెండు భారీ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలు ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాయి.

మహేష్ బాబు పూర్తి కామెడీతో,వినోదాత్మక చిత్రంగా సరిలేరు నీకెవ్వరూ మూవీ చేస్తున్నాడు. 2019సంక్రాంతికి ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తోంది. అతడు సినిమా తరహాలో ఇది ఉంటుందట. ఒక మిలటరీ ఆఫీసర్ ,చనిపోయిన తన ఫ్రెండ్ కోసం అతడి ఊరు కర్నూల్ వెళ్లి,ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం అంటున్నారు. కామెడీ టచ్ ,యాక్షన్ సీన్స్ జోడించి,కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీస్తున్నారట.

మొదటి భాగంలో వచ్చే 30నిమిషాల ట్రైన్ ఎపిసోడ్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ,రెండవ భాగంలో హీరోని హైలెట్ చేయడం,విజయశాంతి డిగ్నిఫైడ్ యాక్షన్, మహేష్ యాక్షన్ వెరసి మహేష్ ఫాన్స్ కి నిజంగా పండగేనని అంటున్నారు. చివరి షెడ్యూల్ కేరళలో జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో తాజాగా రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. టీజర్ సరేసరి. ఒక కోటీశ్వరుని కొడుకు, ఓ కారు డ్రైవర్ కొడుకు చిన్ననాటి నుంచి రివర్స్ లో పెరుగుతారు. కోటీశ్వరుడు పేదవాడిగా, కారుడ్రైవర్ కోటీశ్వరుడుగా పెరుగుతారు. దీనికి ఒక కారణం ఉంది. పెద్దయ్యాక ఈ విషయం తెలుసుకుని, చిన్నప్పుడు తన ఫాథర్ కి గల కోరిక తీర్చడానికి కోటీశ్వరుని ఇంటికి వెళ్తాడు. అక్కడ హీరో ఏమి చేసాడనేది సినిమాలో చూడాలి. కోటీశ్వరుని క్యారెక్టర్ సుశాంత్ చేసాడు. సినిమా కథ పాతదే అయినా చాలా కొత్తదనంతో తీస్తున్నారట.