శ్రీముఖి వల్ల ఈ షో అట్టర్ ప్లాప్ కానుందా.?
ఓ నటిగా కాకుండా యాంకర్ గానే శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత సుపరిచితం అని అందరికి తెలిసిందే.తాను వ్యాఖ్యాతగా ఇప్పటి వరకు ఎన్నో షోలు చేసింది.అలాగే తెలుగు సెన్సేషనల్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో లోకి వెళ్తుంది అన్న సమయానికి తాను చేసే అన్ని షోలను కూడా ఆపేసింది.అలాగే బిగ్ బాస్ షో ద్వారా తన ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించి మళ్ళీ తన షోల ద్వారా అలరించేందుకు సిద్ధం అయ్యిపోయింది.
ఇదే బిగ్ బాస్ షోను ప్రసారం చేసిన స్టార్ మా చానెల్లోనే “స్టార్ట్ మ్యూజిక్” సీజన్ 2 కి యాంకర్ గా వారు పెట్టుకున్నారు.అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈషో కేవలం శ్రీముఖి వల్లే అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.ఈ షోకు ఎంతతైతే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందో అంతే స్థాయిలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తుంది.దానికి తోడు శ్రీముఖితో ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా పాడించారు.
ఆ ప్రయోగంకు మరింత నెగిటివిటి చేరుకుంది.దీనితో ఈ షో ఎప్పుడు మొదలవుతుందో కానీ ఇలాంటి వాటి వల్ల ఎంతమందైతే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారో అంతే స్థాయిలో వ్యతిరేఖంగా ఉన్నారు.మరి ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ షో శ్రీముఖి ఎంత వరకు నెట్టుకు తీసుకువస్తుందో చూడాలి.