హార్ట్ ఎటాక్ తో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యంగ్ హీరోయిన్
విరామం లేని షూటింగ్ ఆ నటి ప్రాణాల మీదకు తెచ్చింది. ‘గాంధీ బాత్’ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ప్రముఖ హిందీ టీవీ నటి గెహానా వసిష్త్ తాజాగా ఓ వెబ్ సిరీస్ కోసం వరుసగా 48 గంటల పాటు నటిస్తూ కుప్పకూలిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిసి వెంటనే ముంబైలోని రక్షా ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పుడామె పరిస్థితి సీరియస్ గా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.టైంకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం.. సుదీర్ఘంగా షూటింగ్ లో పాల్గొనడం.. అసాధారణమైన పనివేళల కారణంగానే నటికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.
మాధ్ ద్వీపంలో వెబ్ సిరీస్ షూటింగ్ లో టీవీనటి గెహానా వసిష్త్ పాల్గొంటోంది.ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెకు గుండె పోటు వచ్చిందని ఆస్పత్రిలో చేర్చారు. పడిపోయిన బ్లడ్ షూగర్ లెవల్ కారణంగా ఆమె ఇప్పుడు వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఆమె అవయవాలు ఏవీ పనిచేయకపోవడంతో పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని వైద్యులు ప్రకటించారు.