Movies

ఒకప్పటి ఈ హీరో గుర్తున్నాడా? ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడో తెలుసా?

వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరి మూవీ లో హీరో ఆదిత్య ఓం ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అంకిత సరసన హీరోగా వేసిన ఓం ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. హిందీలో ఎన్నో సీరియల్స్ లో స్టార్ హీరోగా చేసాడు. ఆదిత్య ఓం ని చూసి, వైవిఎస్ చౌదరి తన సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ధనలక్ష్మి ఐ లవ్ యు ,భామా కలాపం,నిశ్శబ్దం,పొదరిల్లు,ప్రేమించుకుందాం,పెళ్ళికి రండి,గిలిగింతలు,మా ఆయన బంగారం ,నీలవేణి వంటి ఎన్నో సినిమాల్లో ఆదిత్య ఓం కి ఛాన్స్ లు వచ్చాయి. సినిమాలలో ఏవి ఎంచుకోవాలో తెలియకపోవడం వలన వచ్చిన సినిమాలన్నీ చేసేసి,ప్లాప్ లు మూటగట్టుకున్నాడు. ఇకలాభం లేదని,డైరెక్టర్ గా మారాడు.

బందూక్,ఫర్ మై మథర్,మిస్టర్ లోన్లీ -మిస్ లవ్ లీ వంటి సినిమాలను ఆదిత్య ఓం డైరెక్ట్ చేసాడు. అంతటితో ఆగకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తి, క్షుద్ర,డోజాక్ వంటి మూవీస్ నిర్మించాడు. అంతేకాదు రైటర్ గా మారి ఎన్నో సినిమాలకు కథ అందించాడు. ఇంగ్లిష్ మూవీ డెడ్ ఎండ్ మూవీకి రైటర్ గా సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నిర్మాతగా కోట్లు పోగొట్టుకున్నాడు. అయితే దామిని విల్లా, బండి వంటి సినిమాలను తెలుగులో నిర్మించడానికి సిద్ధం అయ్యాడు. పైగా సింగిల్ రోల్ ఉంటుందట. అలా సింగిల్ క్యారెక్టర్ తో సినిమా తీసి,సక్సెస్ కొట్టాలని ఉవ్విళ్ళూరు తున్నాడు.