Movies

సూపర్‌ స్టార్‌ మూవీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు తమిళంలో ఏ స్థాయిలో స్టార్‌డం ఉందో అలాగే తెలుగులో కూడా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున రజినీకాంత్‌ సినిమాలు తెలుగులో వసూళ్లు సాధించాయి.స్టార్‌ హీరోల రేంజ్‌లో రజినీకాంత్‌ మూవీలు ఓపెనింగ్స్‌ను రాబట్టాయి.కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.

తమిళంలో సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ చెక్కు చెదర్లేదు.కాని మన వద్ద మాత్రం ఆయన క్రేజ్‌కు చెదలు పట్టినట్లుగా ఉంది.ఆయన సినిమాలకు మార్కెట్‌ పడిపోయింది.గతంలో రజినీకాంత్‌ సినిమా అంటే హాట్‌ కేక్‌లా అమ్ముడు పోయేది.కాని ఇప్పుడు రజినీకాంత్‌ సినిమాను అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

రజినీకాంత్‌ కొత్త సినిమా దర్బార్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు.దాంతో తమిళనాట ఈ సినిమాకు యమ క్రేజ్‌ ఉంది.కాని తెలుగులో మాత్రం ఈ సినిమా పై పెద్దగా జనాలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు.

దర్బార్‌ తెలుగు వర్షన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ఆసక్తి చూడం లేదట.తక్కువ రేటుకు కూడా కోట్‌ చేసేందుకు ముందుకు రావడం లేదట.ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.ఒకటి రజనీకాంత్‌కు గతంలో మాదిరిగా క్రేజ్‌ లేదు.అలాగే సంక్రాంతికి మనవే రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి.ఈ రెండు కారణాల వల్ల దర్బార్‌ సినిమాను పట్టించుకునే వారు లేకుండా పోయారు.సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.