ఇంటి కోసం కోట్లు ఖర్చుపెడుతున్న జగన్.. ఇక్కడ కూడా!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాస సెక్యురిటీ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది.ఇందులో భాగంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రక్షణ, నిర్వహణ, నూతన సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.1.94 కోట్లు కేటాయించింది.దీనిలో తాడేపల్లిగూడెంలోని సీఎం నివాస నిర్వహణకు రూ.1.20 కోట్లను కేటాయించగా, హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు కూడా నిధులు కేటాయించింది.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సీసీ టీవీ, సెక్యురిటీ నిర్వహణకు రూ.35 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.39 లక్షలు కేటాయించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.రాష్ట్ర సీఎం సెక్యురిటీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులు తెలిపారు.కాగా దీంతో కలిపి ఇప్పటివరకు సీఎం జగన్ ఇంటి నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రూ.16.94 కోట్లు కేటాయించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఒక సీఎం తన ఇంటి కోసం ఇంతలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.సీఎంగా సెక్యురిటీ విషయంలో వృథా ఖర్చు చేస్తున్నాడని జగన్‌ను చెడుగుడు ఆడుతున్నారు ప్రతిపక్ష నేతలు.మరి వారికి అధికార నాయకులు ఎలాంటి కౌంటర్‌లు ఇస్తారో చూడాలి.