‘విక్రమార్కుడు’ సినిమాలోని ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో, ఏమి చేస్తుందో చూస్తే మీ కళ్ళని మీరే నమ్మరు!
చైల్డ్ ఆర్టిస్టులకు సినిమాల్లో,టివి సీరియల్స్ లో మంచి గిరాకీ ఉంది. పిల్లలను చూపించి వాళ్ళ చేత ముద్దు ముద్దుగా మాట్లాడిస్తే ఎంతబాగుంటుందో కదా. అందుకే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఛాన్స్ లు అందిపుచ్చుకుని తమ నటనతో సత్తా చాటుతున్నారు. పెద్దయ్యాక కూడా హీరో హీరోయిన్స్ గా,సపోర్టింగ్స్ యాక్టర్స్ గా కూడా ఓ ఊపు ఊపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మూడేళ్ళ వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి,తొలిమూవీ తోనే తానేమిటో నిరూపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ నేహా తోట.
రక్ష సినిమాలో హడల్ గొట్టే పాత్రలో నేహా నటన సూపర్భ్. రామ్ గోపాల వర్మ తీసిన ఈ మూవీలో నేహా అయితే సరిగా సరిపోతుందని ఛాన్స్ ఇచ్చారు. దెయ్యం పట్టిన పాత్రలో బాగా ఒదిగిపోయింది. భీకరంగా నటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజానికి నేహా పుట్టింది అమెరికాలో అయినా మూడేళ్ళ వయస్సులోనే ఆమె ఫ్యామిలీ ఇండియాలో సెటిల్ అయింది.
పెద్దాయక ఏమౌతావని అడిగితె డాక్టర్ అవ్వాలని ఉందని నేహా చెప్పుకొచ్చింది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు లో తల్లిలేని పిల్లగా అద్భుత నటన ప్రదర్శించిన నేహా,ఆతర్వాత అనసూయ,రాముడు వంటి మూవీస్ లో నటించి తన సత్తా చాటింది. ఇంకా ఎన్నో ఛాన్స్ లు వచ్చినా స్టడీ కోసం విరామం ఇచ్చింది. ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. స్టడీస్ మీద దృష్టి పెట్టానని,డాక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నాని అంటోంది. నటన అంటే ఇష్టం కనుక నటించే ఛాన్స్ వస్తే నటిస్తానని చెబుతోంది.