Movies

టిఫిన్లు అమ్ముకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…షాక్ లో సినీ ఇండస్ట్రీ.. అభిమానులు..

కొందరు హీరోయిన్స్ కి స్టార్ హోదా కొనసాగుతున్న సమయంలో నేలమీద చూపులు నిలవవు. ఎక్కడో ఆకాశంలో విహరిస్తుంటారు. సినీ మాయలో వాళ్ళు కొట్టుమిట్టాడాతారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో వుంది. ఇది నిజంగా షాకిచ్చే ఘటనగానే చెప్పాలి. తెలుగులో అంతగా పరిచయం లేకున్నా ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.

ఆ నటి పేరు పూజ. హిందూస్తాన్,సింధూర్ సౌగంధ్ వంటి హిట్ సినిమాలతో దూసుకెళ్లి,సల్మాన్ ఖాన్ తో కూడా కల్సి నటించింది. 1995లో వీర్ ఘాటీ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో జోడీ కట్టింది. అంతటి స్థాయిలో వెలుగొందిన పూజ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే షాక్ తింటాం. క్షయవ్యాధికి గురై కొన్నాళ్ల క్రితం డబ్బులేక హాస్పిటల్ లో పడివుండడంతో ఈ వార్త విపరీతంగా వైరల్ అయింది.

సోషల్ మీడియాలో వచ్చిన వార్తతో చాలామంది స్పందించి ఆమెకు సాయం అందించారు. ఆమె చికిత్సకు సల్మాన్ ఆర్ధికంగా చేయూతనిచ్చాడు. అయితే సినిమా ఛాన్స్ లు రాకపోవడంతో బతుకు తెరువు కోసం ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతోంది. అయితే ఫీల్డ్ లో వెలుగుతున్న కాలంలో సంపాదించిందంతా ఏమి చేశావంటే అంతా పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చింది. తనపై జాలి కాకుండా,సినిమా ఛాన్స్ లు ఇస్తే చాలునని అంటోంది.