EDUCATION

బెంగుళూరలో నిద్రపోయే ఉద్యోగం… మీరు కూడా అర్హులే

ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి.వాటిలో కొన్ని వింత ఉద్యోగాలు కూడా ఉంటాయి.మార్కెట్ లోకి కొత్త కొత్త ఉత్పత్తులని తీసుకొచ్చే కంపెనీలు వాటిని శాంపిల్ గా వాడటానికి కొన్ని రకాల ప్రత్యేకమైన ఉద్యోగాలు సృష్టిస్తుంది.ఆ ఉద్యోగాలు చేసే వారికి మంచి జీతాలు కూడా ఇస్తాయి.అలాగే బెంగుళూరులో ఓ కంపెనీలో నిద్రపోయే ఉద్యోగం కూడా ఇస్తుంది.రోజుకి తొమ్మిది గంటలు సంతృప్తిగా నిద్రపోతే చాలు మీకు జీతం వస్తుంది.అయితే ఇంత విచిత్రమైన ఉద్యోగాలని ఆ కంపెనీ ఎందుకు ఇస్తుంది అని చాలా మంది డౌట్ వచ్చి ఉండొచ్చు.

ప్రతి రోజూ రాత్రి 9 గంటల పాటు ఫుల్లుగ నిద్రపోతే లక్ష రూపాయల జీతం ఇస్తామంటోంది.అయితే 100 రోజులపాటు ఈ డ్యూటీ కచ్చితంగా చేయాలి.బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ అనే కంపెనీ బెడ్ పరుపులను తయారు చేస్తుంది.వినియోగదారులకి కావాల్సిన క్వాలిటీలో పరుపులు తయారు చేయడం కోసం స్లీప్ ప్యాట్రన్స్‌పై స్టడీ చేయడానికి కంపెనీ సిద్ధమైంది.దాని కోసం మూడు నెలల ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది.దీని కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థులు బాగా నిద్రపోగలరని నిరూపించికునేందుకు తమ వివరాలు రాసి పంపితే ఇంటికే ఆ కంపెనీ మ్యాట్రెస్, స్లీప్ ట్రాకర్స్ పంపుతారు.

సెలెక్ట్ అయిన వాళ్లు నిద్రపోయే సమయం మొత్తాన్ని వీడియో తీసి పంపాల్సి ఉంటుంది.అలా చేస్తే నెలకి లక్ష రూపాయిల జీతం మూడు నెలల పాటు మీ ఎకౌంటు లో పడుతుంది.కాస్తా వింతగా ఉన్న ఈ ఆఫర్ మాత్రం నిద్రపోవడం బాగా అలవాటున్న వారిని ఊరించే అంశం అని చెప్పాలి.