ప్రియాంక రెడ్డి గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియని నిజాలు
తెలుగు రాష్ట్రాలనే కాదు,యావత్ భారత దేశాన్నే కుదిపేసిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై అత్యాచారం,హత్య ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మూగజీవాలకు వైద్యం అందిస్తూ వస్తున్న ఆమెపై నాలుగు మానవ మృగాలు కౄరంగా దాడిచేసి,దారుణంగా అత్యాచారం జరిపి,హత్య చేశాయి. సంచలనం సృష్టించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా గా వైరల్ అయింది. చర్చకు దారితీసింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ప్రియాంక నలుగురి కౄరత్వానికి బలైంది.
ఇంటినుండి క్షేమంగా బయలుదేరిన డాక్టర్ ప్రియాంక సగం కాలిపోయి,బూడిదగా ఇంటికి చేరింది. 1993లో నాగర్ కర్నూల్ జిల్లా నర్సయ్య పల్లెలో శ్రీధర్ రెడ్డి,విజయ రెడ్డిలకు పుట్టిన ఈమెకు భవ్య రెడ్డి అనే చెల్లెలు ఉంది. శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. చిన్ననాటి నుంచి మూగ జీవాలు,పక్షులపై ప్రేమ అమితంగా ఉండేది. అందుకే వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంది.
ప్రియాంక మహబూబ్ నగర్ లో చదువు పూర్తిచేసి,మెడిసిన్ కోసం 2011లో హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని పివి నరసింహారావు వెటర్నరీ కాలేజీలో చేరి,2014లో డాక్టర్ పట్టా అందుకుంది. ఆతర్వాత ఏడాది పాటు ప్రయివేట్ పశు వైద్య శాలలో వెటర్నరీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసింది. ఆతర్వాత నవాబ్ పేటలో వెటర్నరీ డాక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది. దాంతో కుటుంబం తో సహా శంషాబాద్ లో నివాసం మార్చింది.