Movies

సూపర్ హిట్ మూవీస్ వదులుకొని ఇప్పటికి బాధ పడుతున్న హీరోలు

సినిమా ప్రపంచంలో ఎవరి లెక్కలు వారివి. ఒక్కోసారి ఆ లెక్కలు తప్పుతుంటాయి. ఫలితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాలను మిస్ చేసుకుంటారు. అలాంటి ఘటనలు చూస్తే, అర్జున్ నటించిన జంటిల్ మాన్ మూవీని మొదట్లో డాక్టర్ రాజశేఖర్ తో తీయాలని చూసారు. కానీ డేట్స్ కుదరక వదిలేసుకున్న ఈ మూవీ అర్జున్ కి ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది. అలాగే డాక్టర్ రాజశేఖర్ మరో బ్లాక్ బస్టర్ ఠాగూర్ ని వదులుకోవాల్సి వచ్చింది.

తమిళ రీమేక్ అయిన ఈ మూవీని మెగాస్టార్ హీరోగా వివి వినాయక్ తెరకెక్కించాడు. మొదట్లో హక్కులు కొనుగోలుకు ప్రయత్నించిన డాక్టర్ రాజశేఖర్ చివరకు కొన్ని కారణాల వలన వదులుకోవడం వలన చిరంజీవి చేతికి వెళ్ళింది. నిజానికి చిరంజీవి ,రాజశేఖర్ ల మధ్య గొడవకు ఈ మూవీయే కారణం. కాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి హిట్ గా నిల్చిన సింహాద్రి మూవీని కథకుడు విజయేంద్ర ప్రసాద్ మొదట్లో బాలయ్య కోసం రాసాడు. బాలయ్య నిరాకరించడంతో కొన్ని మార్పులు చేసి జూనియర్ తో తీయడంతో బంపర్ హిట్ అయింది .

ఇక తమిళంలో హిట్ అయిన చంటి మూవీని రాజేంద్రప్రసాద్ తీయాలని అనుకుంటే,వెంకటేష్ చేసాడు. ఈ సినిమా టాలీవుడ్ లో వెంకీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికీ రాజేంద్రప్రసాద్ దీన్ని గుర్తుచేసుకుని చాలా ఫీలవుతూ ఉంటాడు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ ఒకటి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమా ఎన్నో వివాదాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయింది. ముందుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తే ఈ సినిమా చేయడానికి నో అన్నాడు. తర్వాత శర్వానంద్ దగ్గరకు వెళ్తే బోల్డ్ గా ఉందని నిరాకరించాడు. చివరకు విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లడంతో అతడి కెరీర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది.