Movies

ప్రేమను త్యాగం చేసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు,బ్రేక్ అప్ లు సహజం. అయితే ప్రేమ హయాంలోనే బ్రేక్ అప్ చెప్పడం విశేషం. లవర్ బాయ్ తరుణ్ ,ఆర్తి అగర్వాల్ నడుమ ప్రేమ నడిచిందని,అతడి కారణంగా ఆమె గర్భం కూడా దాల్చిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అందుకే ఆమెకు ఛాన్స్ లు తగ్గాయని అనుకున్నారు. ఇక కోలీవుడ్ లో క్రేజీ హీరో విశాల్ కి శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నడుమ లవ్ ఎఫైర్ నడిచిందన్న వార్తలు వచ్చాయి. ఇది రాధికా,శరత్ కుమార్ ల మధ్య విబేధాలకు దారితీసింది. విశాల్ తో ప్రేమకు ఒప్పుకోకపోవడంతో నడిగర సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ కి వ్యతిరేకంగా విశాల్ పనిచేసి ఓడించాడు.

ప్రేమను కాదని తిరస్కరించినందుకు ఎన్నో సినిమాలు చేస్తూ,సామాజికంగా కూడా ఎందరికో సాయం చేస్తూ మంచి పేరు కూడా విశాల్ తెచ్చుకుంటున్నాడు. వరలక్ష్మితో బ్రేక్ అప్ అయ్యాక అమీషాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మరోపక్క వరలక్ష్మి కూడా చాలా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. అయితే 20కోట్ల బడ్జెట్ తో జెమిని వాళ్ళు ఈమెతో తీసిన మదగజరాజా మూవీ విడుదల కాకుండా నిలిచిపోయింది.

తమిళ హీరో శింబు ఎందరితోనో లవ్ ఎఫైర్ చేసి, ఏకంగా నయనతార తో ప్రేమాయణం నడిపాడు. అయితే పెళ్లిదాకా వచ్చాక ప్రభుదేవా తో నయన్ ప్రేమాయణంలో పడింది. ఈమె కారణంగా భార్య పిల్లలను కూడా ప్రభు వదులుకోవడం అప్పట్లో సంచలనం. భారీగా భరణం కూడా భార్యకు ఇవ్వాల్సి వచ్చింది. అమలాపాల్, విజయ్ జంట పెళ్లయ్యాక విడిపోయారు.

మరి ఏమైందో ఏమో గానీ ప్రభు,నయన్ ల మధ్య యవ్వారం బెడిసి కొట్టింది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి కి జర్నీ ఫేమ్ జై తో లవ్ ఎఫైర్ నడిచింది. అయితే ఆమె సన్నబడడానికి ట్రై చేస్తోందని తెల్సి ఆమెను జై వదిలించుకున్నాడని టాక్ వచ్చింది. మొదట్లో కొన్ని హిట్స్ కొట్టి,ఆతర్వాత ప్లాప్ లు అందుకుంటూ హిట్ కోసం పరితపిస్తున్న మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ కి రెజీనా కు అఫైర్ నడిచిందని టాక్ బలంగా వచ్చింది. ఇతడి వలన రెజీనా కెరీర్ కూడా దెబ్బతిందన్న కామెంట్స్ వచ్చాయి.

అయితే ఆమెతో తనకు ప్రేమ వ్యవహారం లేదని,ఆమె ఎవరినీ ప్రేమించినా అభ్యంతరం లేదని చెప్పడం చూస్తుంటే ఇద్దరి మధ్యా బ్రేక్ అప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని అఖిల్ ,శ్రేయో భూపాల్ నడుమ ప్రేమాయణం నడిచి, నిశ్చితార్ధం తర్వాత బ్రేక్ అప్ అయింది. ఎయిర్ పోర్టులో చిన్న ఇగో కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారని టాక్.