వెంకటేష్ రీమేక్ చేసిన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలు ఎన్నో తెలుసా?
విక్టరీ వెంకటేష్ మంచి సినిమాల వేటలో ఎన్నో రీమేక్ మూవీస్ చేసాడు. ప్రస్తుతం తమిళంలో హిట్ కొట్టిన అసురన్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అయితే గతంలో రీమేక్ చేసిన మూవీస్ లో కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. మలయాళంలో ముమ్ముట్టి హీరోగా వచ్చిన ఆనందం మూవీని తెలుగులో సంక్రాంతిగా తీసి హిట్ అందుకున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన మూవీని తెలుగులో రాజా పేరిట రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. సూర్య హీరోగా నటించిన సినిమాను తెలుగులో ఘర్షణగా చేసి, మిశ్రమ ఫలితం అందుకున్నాడు. శరత్ కుమార్ తమిళంలో హీరోగా చేసిన సూర్య వంశం సినిమాను తెలుగులో అదేపేరుతో తీసి, హిట్ కొట్టాడు. విజయకాంత్ హీరోగా తమిళంలో వచ్చిన సినిమాను తెలుగులో చినరాయుడు గా తీసి మిశ్రమ ఫలితం అందుకున్నాడు.
విక్రమ్ హీరోగా వచ్చిన జెమిని మూవీ తెలుగులో అదే పేరిట తీసి, ప్లాప్ టాక్ అందుకున్నాడు. తమిళంలో భాగ్యరాజా హీరోగా వచ్చిన సినిమాను తెలుగులో అబ్బాయిగారుగా రీమేక్ చేస్తే,డిజాస్టర్ అయింది. అలాగే భాగ్యరాజా కథతో వచ్చిన సినిమాను తెలుగులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుగా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. భాగ్యరాజా హీరోగా వచ్చిన సినిమాను తెలుగులో సుందరకాండగా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల మూవీని హిందీలో వెంకీ హీరోగా తక్ దీర్ వాలేగా రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.
అలాగే హిందీలో వచ్చిన మూవీని తెలుగులో పోకిరి రాజా గా రీమేక్ చేసి డిజాస్టర్ గా నిలిచాడు. మాధవన్ హీరోగా నటించిన మూవీని తెలుగులో గురుగా రీమేక్ చేసాడు. వసంతం మూవీని తమిళంలో మాధవన్ హీరోగా ఒకేసారి తెరకెక్కించారు. రీమేక్ కాకున్నా సూపర్ హిట్ అయింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమాను తెలుగులో కొండపల్లి రాజా గా రీమేక్ చేసి, మిశ్రమ ఫలితం అందుకున్నాడు. తమిళంలో వచ్చిన మూవీని తెలుగులో చంటిగా రీమేక్ చేసి హిట్ కొట్టి,హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడా హిట్ అందుకున్నాడు. హిందీలో సన్నీ డియోల్ హీరోగా నటించిన అర్జున్ మూవీని తెలుగులో భారతంలో అర్జునుడిగా తీసి మిశ్రమ ఫలితం పొందాడు.
హిందీలో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన తేజాబ్ మూవీని తెలుగులో టూ టౌన్ రౌడీగా తీసి,డిజాస్టర్ గా నిలిచాడు. అలాగే తమిళంలో మైఖేల్ రాజా మూవీని బ్రహ్మపుత్రుడుగా చేసి,సూపర్ హిట్ కొట్టాడు. హిందీలో వచ్చిన నసీబ్ మూవీని రాజేంద్ర ప్రసాద్,అర్జున్ లతో కల్సి నటిస్తూ చేసిన త్రిమూర్తులు మూవీ విఫలమైంది. తమిళంలో లివింగ్ స్టెన్ హీరోగా వచ్చిన మూవీ తెలుగులో శీను గా తీసి,డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అలాగే హిందీలో పరేష్ రావెల్, అక్షయ కుమార్ నటించిన ఓ మై గాడ్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ తో కల్సి గోపాల గోపాల గా తీసి హిట్ అందుకున్నాడు.
అలాగే తమిళంలో హిట్ అయిన దృశ్యం సినిమాను అదే పేరిట తెలుగులో రీమేక్ చేసి,బంపర్ హిట్ కొట్టాడు. హిందీలో అమితాబ్,అభిషేక్ బచ్చన్ కల్సి నటించిన బోల్ బచ్చన్ మూవీని తెలుగులో రామ్ తో కల్సి మసాలాగా తీసి,ప్లాప్ టాక్ అందుకున్నాడు. ఇక మలయాళంలో దిలీప్ హీరోగా నటించిన బాడీగార్డ్ మూవీని అదేపేరిట తెలుగులో రీమేక్ చేసి,ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. కన్నడంలో విష్ణు వర్ధన్ నటించిన సూపర్ హిట్ మూవీ ఆత్మ రక్షక్ ని తెలుగులో నాగవల్లిగా తీసి,అది కూడా ప్లాప్ టాక్ అందుకున్నాడు. హిందీలో అనుపమ్ ఖేర్ ,నజీరుద్దీన్ నటించిన వెడ్నెస్ డే మూవీని తెలుగులో ఈనాడుగా కమల్ తో కలిసి చేసి డిజాస్టర్ అందుకున్నాడు.