సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన లేడి ఫైర్ బ్రాండ్ – ఎందుకంటే…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొన్ని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ఇటీవల మహిళలపై ఒక కొత్త చట్టం తెస్తామని సీఎం జగన్ సభలో మాట్లాడటం ఆనందాన్ని కలిగిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి సీఎం జగన్ ని ప్రశంసించారు. కాగా మహిళల విషయంలో ఎక్కువ భద్రతా తీసుకోవాలనుకుంటున్నటువంటి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నామని, ఈమేరకు అత్యాచార బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని సీఎం జగన్ కోరడం నిజంగా శుభపరిణామం అని వాఖ్యానించారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ ఘటన పై దేశం అంత కూడా ఆగ్రహ జ్వాలలు రగిలిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా చేయాలనే లక్ష్యంతో మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టేందుకు సీఎం జగన్ చేసిన ప్రతిపాదనని అభినందిస్తున్నామని, ఇలాంటి చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని విజయశాంతి కోరారు.