మీకు తెలియని ఈ టాలీవుడ్ స్టార్స్ మధ్య ఉన్న చుట్టరికం తెలుస్తే షాక్ !!
సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని తీవ్రంగా ప్రయత్నించి హీరో హీరోయిన్స్ గా,డైరెక్టర్స్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్ గా రాణిస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొందరి మధ్య చుట్టరికం కూడా ఉంది. కొందరి గురించి తెల్సినా,కొందరి చుట్టరికం గురించి తెలీదు. కొందరి బంధుత్వాల గురించి తెలిస్తే షాకవుతాం. తెలుగు సినీ చరిత్రలో రారాజు గా వెలుగొందిన ఎన్టీఆర్ కి,అందాల నటుడు శోభన్ బాబుకి గల సంబంధం తెలిస్తే నోరెళ్లబెడతారు. వీళ్లిద్దరి మధ్యా బావా బావమరుదుల సంబంధం ఉందట.
ఎన్టీఆర్ తమ్ముడి కొడుకుని,శోభన్ బాబు మూడో కూతురికి పెళ్లి జరిగింది. దీన్ని బట్టి ఇద్దరూ వియ్యంకుల వరసన్నమాట. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి ,డైరెక్టర్ మెహర్ రమేష్ కి కూడా చుట్టరికం ఉందట. ఇద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారట. ఇక డైరెక్టర్ మారుతి కామెడీ ,ఎంటర్టైన్ మెంట్ మూవీస్ తీయడంలో దిట్ట. అల్లు అరవింద్ తో మారుతికి మామా అల్లుళ్ళ సంబంధం ఉంది. మారుతి వాళ్ళ అమ్మ,అరవింద్ కి చెల్లెలు వరుస అవుతుంది. బన్నీకి బావ వరుసన్నమాట.
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసి,ప్రపంచ వ్యాప్తంగా మలిచి, జక్కన్నగా ముద్రపడ్డ డైరెక్టర్ రాజమౌళి ఎందరో హీరోల జీవితాలను మలుపు తిప్పాడు. రాజమౌళి గుర్తింపు వెనుక రమా రాజమౌళి కీలక భూమిక వహిస్తోంది. రాజమౌళి కుటుంబంలో చాలామంది సినీ రంగంలో వివిధ శాఖల్లో ఉన్నారని అందరకూ తెలిసిందే. అయితే రమా రాజమౌళి అన్నకూడా సినిమా రంగం వాడని చాలామందికి తెలీదు. లిటిల్ సోల్జియర్స్ మూవీ, అమృతం సీరియల్ కి దర్శకుడిగా వ్యవహరించిన గుణ్ణం గంగరాజు స్వయానా రమా రాజమౌళి కి అన్నయ్య అవుతాడు.