సీనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా ఎందుకు చేయలేకపోయారు?
తెలుగు సినీ చరిత్రలో అంచెలంచెలుగా ఎదిగి ,వెండితెర ఇలవేల్పుగా వెలుగొందిన హీరో ఎవరంటే ఠక్కున నందమూరి తారకరామారావు అని చెబుతాం. పౌరాణిక పాత్రలైన శ్రీకృష్ణడు,రాముడు,రావణాసురుడు,భీముడు,దుర్యోధనుడు, అర్జునుడు ,భీష్ముడు ఎలా ఏపాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. ఇక జానపదం,సాంఘికం,ఉదాత్తమైన పాత్రలు ఇలా ఏవైనా సరే, ఎన్టీఆర్ కి అచ్చంగా సరిపోయాయి. అందుకే టాలీవుడ్ ని ఏలారు. తెలుగు భాషపై పట్టు కలిగి ఉండడం,అభినయం ,ఆహార్యం అన్నీ ఆయనకు కలిసొచ్చాయి.
ఇక అన్ని రకాల సినిమాలు చేసినా సరే,ఒక్క అల్లూరి సీతారామరాజు సినిమా చేయలేకపోయారు. అది ఆయనను చాలాకాలం వేధించిందని అంటారు. నిజానికి 1954లోనే ఎన్టీఆర్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకున్నారట. సొంత ప్రొడక్షన్ సంస్థ ఎన్ ఏ టి ద్వారా సినిమా చేయాలనీ భావించారు. సెట్స్ మీదికి వెళ్లాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవరోధం వెంటాడింది.
అయితే సూపర్ స్టార్ కృష్ణ తన 100వ సినిమాగా అల్లూరి సీతారామరాజు సినిమాను ఎంచుకుని 1974లో సొంతంగా తెరకెక్కించారు. ఈస్టమన్ కలర్ లో తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్ అల్లూరి సినిమా చేయడానికి అన్నీ రెడీ చేయమనడంతో కృష్ణ తీసిన సినిమాను డైరెక్టర్ చూపించారట. ఇక ఆసినిమా చూసాక అల్లూరి సినిమా తీయాలన్న సంకల్పం వదులుకున్నారట.