9 హిట్ అయిన సినిమాలను వదులుకొని ఇప్పుడు బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అయితే తారక్ కి కథ చెప్పాక, అతడు నో చెబితే,వేరేవాళ్లతో తీసినప్పుడు అది హిట్ అవుతూ వస్తోందట. అందుకే తారక్ నో చెప్పాడంటే,మన పంట పడినట్లేనని కొందరు దర్శకులు సెంటిమెంట్ గా భావిస్తారట. కొరటాల శివ తానూ రూపొందించిన శ్రీమంతుడు కథను తారక్ కి వివరించగా, ఇది తనకు బాగోదని అనేసాడట.
అలా తారక్ తిరస్కరించిన శ్రీమంతుడు మూవీ మహేష్ బాబుతో కొరటాల శివ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిల్చింది. భద్ర సినిమా కూడా బోయపాటి ముందుగా తారక్ కి చెప్పాడట. అయితే నో చెప్పేయడంతో రవితేజను ఛాన్స్ వరించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే రవితేజా నటించిన కృష్ణ,కిక్ సినిమాలు కూడా ముందుగా తారక్ గడప తొక్కినవే.
అంతెందుకు దిల్ సినిమా కథను తారక్ కి వివి వినాయక్ వినిపిస్తే వద్దని చెప్పాడట. అది కాస్తా నితిన్ నటించడంతో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాత రాజు ఏకంగా దిల్ రాజు అయిపోయాడు. దర్శకుడు సుకుమార్ ఆర్య మూవీ కథను ముందుగా తారక్ కి చెప్పాడు. నో చెప్పడంతో అల్లు అర్జున్ దగ్గరకి చేరింది. ఈ మూవీ బన్నీ రేంజ్ ని అమాంతం పెంచేసింది. అలాగే సురేంద్ర రెడ్డి అతనొక్కడే కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపిస్తే నో చెప్పేసాడు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ దగ్గరకి చేరి సూపర్ హిట్ అయింది.