పటాస్ షో గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన యాంకర్ రవి
బుల్లితెరపై జనాన్ని బాగా ఆకట్టుకున్న పటాస్ షో నుంచి యాంకర్ రవి తప్పుకుంటూ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ కల్గించాయి. గత నాలుగేళ్లుగా ఈ షోలో చేస్తున్న రవి ఎందుకు బయటకు వచ్చాడో చెబుతూ నాలుగేళ్లపాటు ఈ షో చేసి బయటకు రావడం బాధగానే ఉందన్నాడు. షో నుంచి బయటకు రావడంపై రకరకాల వార్తలు రావడం గురించి ప్రస్తావిస్తూ,సముద్రం ఉన్నవాడిని కదా, సముద్రం బయట జనం ఉంటారని,అందుకే ఏదైనా జరిగితే రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేస్తాయని అన్నాడు.
ఈరోజుల్లో సెలబ్రిటీలు బయటకు వచ్చి ఉన్నది ఉన్నట్లు చెప్పలేకపోతున్నారని రవి అన్నాడు. వాస్తవం వదిలేసి ఇష్టమైనది తీసుకోవడం వలన సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తుంటాయని అందుకే ఉన్నది ఉన్నట్టు మాట్లాలేకపోతున్నామని వివరించాడు. రోజూ కనిపిస్తే హీరోస్ కూడా లోకువ అయిపోతారని అందుకే జనానికి దూరంగా హీరోలు ఉంటారని చెబుతూ,తాను కూడా వారానికి ఒకరోజు కన్పిస్తే ఎలా ఉంటుందోనని తప్పుకున్నానని వివరించాడు.
పటాస్ నుంచి ఒక్కరోజులో బయటకు రాలేదని,చాలా రోజులుగా చర్చ నడుస్తోందని రవి చెప్పాడు. ఒక్కో షెడ్యూల్ కి నాలుగు రోజుల చొప్పున 80షెడ్యూల్స్ షూటింగ్స్,రోజుకి నాలుగు ఎపిసోడ్స్ చొప్పున 1200ఎపిసోడ్స్ చేశామని చెప్పాడు. ఒక్క షోలో ఇలా ఇన్ని షోస్ చేయడం మామూలు విషయం కాదన్నాడు. ప్రతిరోజూ కష్టపడ్డంతో పాటు కొత్తగా చేయాలనే తపన కూడా ఉండేదని రవి వివరించాడు. కొత్తదనం చూపించాలంటే కొన్నాళ్ళు తప్పుకోవాలని భావించి తప్పుకున్నానని చెప్పాడు.