Movies

లీడర్ భామ రీచా గంగోపాధ్యాయ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

రానా డెబ్యూ చిత్రం ‘లీడర్‌’తో డెబ్యూ చేసిన ముద్దుగుమ్మ రీచా గంగోపాధ్యాయకు పెళ్లయిపోయిందట. ‘లీడర్‌’ తర్వాత ప్రబాస్‌తో ‘మిర్చి’, రవితేజతో ‘సారొచ్చారు’, ‘మిరపకాయ్‌’, నాగార్జునతో ‘భాయ్‌’ తదితర చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పై చదువుల నిమిత్తం విదేశాలకు చెక్కేసింది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా పెళ్లికూతురిలా దర్శనమిచ్చింది. గత కొంత కాలంగా ఓ అమెరికా అబ్బాయ్‌తో లవ్‌లో ఉందట. ఆయన పేరు జోకు అని తెలుస్తోంది. ప్రేమ ముదిరి పాకాన పడి పెళ్లి వరకూ చేరిందట. అయితే, పెళ్లి వార్తను సీక్రెట్‌గా ఉంచింది ఎందుకో ఈ బొద్దుగుమ్మ.

అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య రీచా వివాహం చాలా గోప్యంగా జరిగిపోయింది. నెట్టింట్లో రీచా పెళ్లి ఫోటోలు దర్శనమిస్తే కానీ, ఆమెకు పెళ్లయ్యిందన్న సంగతి బయట పడలేదు. అయితే, నిజంగానే రీచా పెళ్లి చేసుకుందా.? ఏమో ఈ అందాల భామ స్వయంగా కన్‌ఫామ్‌ చేస్తే కానీ నమ్మలేం. ఇకపోతే, ‘భాయ్‌’ సినిమా తర్వాత రీచా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. చాలాసార్లు రీచా గంగోపాధ్యాయ్‌ మళ్లీ వస్తుందట.. అనే వార్తలు వినిపించాయి. కానీ, ఎందుకో ఈ అమ్మడికి నటనపై అంతగా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. మంచి అవకాశాలొచ్చినా, చదువు పేరు చెప్పి సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.