ఈ దశాబ్డంలో టాలీవుడ్ కోల్పోయిన అత్యుత్తమ విలన్స్ వీరే…!
టాలీవుడ్ మూవీ లలో విలన్ పాత్రలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విలన్ గా చేసి, హీరో అయినవాళ్లు ఉన్నట్టే,హీరోగా చేసి,విలన్ గా రాణిస్తున్న వాళ్లూ ఉన్నారు. అయితే విలన్ గా ఓ ఊపేసిన నటులు ఈలోకం నుంచి వెళ్లిపోయారు. అందులో విలన్ రామిరెడ్డి ఒకరు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో డాక్టర్ రాజశేఖర్ జీవిత నటించిన అంకుశం మూవీ ద్వారా రామిరెడ్డి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర నిర్మాత ఎమ్మెస్ రెడ్డికి యితడు సమీప బంధువు. 1989లో వచ్చిన ఈమూవీతో రామిరెడ్డి తారాస్థాయికి చేరి ఆతర్వాత చాలా చిత్రాల్లో మెయిన్ విలన్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ,మళయాళ ,హిందీ మూవీస్ కలిపి దాదాపు 250సినిమాల్లో నటించి ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.
గాయం,ఒసే రాములమ్మ,అనగనగా ఒకరోజు,అమ్మోరు వంటి మూవీస్ రామిరెడ్డికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. కిడ్నీ వ్యాధితో ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన రియల్ స్టార్ శ్రీహరి ధర్మక్షేత్రం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా,నిర్మాతగా వివిధ పాత్రలు పోషించిన శ్రీహరి కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే, హఠాత్తుగా అనారోగ్యంతో మరణించారు.
ఆహుతి మూవీతో విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రసాద్ కి అదే సినిమా ఇంటిపేరు గా మారిపోయింది. విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మూవీలో ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నాడు. 2008లో చందమామ మూవీకి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,కొత్త బంగారులోకం వంటి పలు హిట్ సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ 2015లో ఈలోకం నుంచి నిష్క్రమించాడు.