దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ తెరంగేట్రం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరియు మరి కొంతమంది నటీనటులు కూడా సినీ పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారు.
అయితే తాజాగా తాను చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలేసి సినీ తెరంగేట్రం చేసింది నిత్య శెట్టి. అయితే తెలుగు సినీ పరిశ్రమలో నిత్య శెట్టి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ అప్పట్లో వచ్చిన దేవుళ్ళు సినిమాలో విడిపోవాలనుకుంటున్న తన తల్లిదండ్రులను ఎలాగైనా కలాపాలనుకునే చిన్నపాప భవాని పాత్ర అంటే ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. అయితే ఆమె లిటిల్ హార్ట్స్, చిన్ని చిన్ని ఆశ వంటి చిత్రాల్లో బాల నటిగా నటించి అతి చిన్న వయసులోనే బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుని ఔరా అనిపించింది.
అయితే ఇదంతా బాగానే ఉన్నా తర్వాత ఏమైందో ఏమో కానీ సినీ పరిశ్రమకు దూరంగా వెళ్ళిపోయి బాగా చదువుకుని ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలో నిత్య శెట్టి ఉద్యోగాన్ని సంపాదించింది. అయితే ఎంతో ఇష్టపడి సంపాదించిన ఉద్యోగంతో సంతృప్తి లేక 2016వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు చునియా దర్శకత్వంలో వచ్చిన “పడేశావే” అనే చిత్రంలో హీరోయిన్ గా మళ్ళీ తెరంగేట్రం చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆమె ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం కంటే సినిమాల్లో నటించడం అంటేనే తనకు ఇష్టమని, అందుకే తాను మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నానని తెలిపారు.
ఈ సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్ కొముకుల నటించిన నువ్వు తోపురా అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడు అవకాశాల ఆశలపై గండి పడినట్లయింది. ఇక్కడ అవకాశాలు రాకపోయినా తమిళలంలో ఓ చిన్న చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే చూడాలి మరి జీవితాంతం తన ప్రయాణాన్ని సినిమా ఇండస్ట్రీ లో కొనసాగిస్తుందో లేక మళ్ళీ ఐటీ సాఫ్ట్ వేర్ జాబ్ చేయడానికి వెళ్ళిపోతుందో…