Politics

చిరు – పవన్ ల మధ్య మెగా బ్రదర్ తిప్పలు… పాపం అయోమయంలో నాగబాబు

కొన్ని సామెతలు కొందరికి అచ్చంగా సూటవుతాయి. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లు గా నాగబాబు పరిస్థితి తయారైంది. ఇలాంటివి నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మెగా బ్రదర్ కొట్టుమిట్టాడుతున్నాడు. చాలా రోజులుగా సినిమాలు తప్ప మరో ధ్యాసే లేని చిరంజీవి.. ఉన్నట్లుండి మూడు రాజధానుల విషయంలో స్పందించేసాడు. పోనీ తన అభిప్రాయం చెబితే పర్వాలేదు కానీ జగన్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు స్టేట్ మెంట్ ఇచ్చాడు.

జగన్ లేకుంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదనే రేంజ్‌లో చిరంజీవి పొగిడేసాడు. అయితే మూడు రాజధానుల విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు. నాలుగు భవనాలు, నాలుగు రోడ్లు వేసినంత మాత్రానా రాజధాని కాదు జగన్ గారూ అంటూ పవర్ స్టార్ విమర్శించాడు. ఇలాంటి సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్‌కు సపోర్ట్ చేయడంతో పవన్ ఒక్కడే కాదు, ఆయన వెంట ఉన్న నాగబాబుకు కూడా కరెంట్ షాక్ తగిలింది.

ఇలాంటి కీలక సమయంలో తమ్ముడి వెంట నడవాలా లేదంటే దేవుడిగా భావించే అన్నయ్యను సపోర్ట్ చేయాలో అర్థం కాక నాగబాబు జుట్టు పీక్కుంటున్నాడు. అయితే చిరు మాటలు విన్న తర్వాత కూడా జై జనసేన అంటున్నాడు. అంటే అన్న కంటే తమ్ముడికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ తన అడుగులు జనసేనతోనే అంటున్నాడు. రైతులకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నాడంటూ ఓ సంచలన వీడియో కూడా విడుదల చేసాడు. ఈ మెగా డ్రామా ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందా అని చర్చ సాగుతోంది.