Movies

6 ఏళ్ళు సాగర్ ఎందుకు బయటకు రాలేదో తెలిస్తే షాక్ అవుతారు

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. అవి అలరిస్తూనే ఉన్నాయి. అయితే మొగలి రేకులు సీరియల్ కి గల గుర్తింపు మాత్రం దేనికీ రాదని అంటూంటారు. సంచలనం సృష్టించిన ఈ సీరియల్ 2008లో ప్రారంభమైంది. ఈ సీరియల్ లో ఆర్ కె. నాయుడు ,మున్నా రెండు పాత్రల్లో సాగర్ నటించాడు. ఈ సీరియల్ లో నటించడం మొదలుపెట్టాక బాహ్య ప్రపంచానికి చాలా దూరంగానే ఉన్నాడు.

ఈ సీరియల్ లో మున్నా పాత్ర మామూలుగానే ఉంటుంది. అయితే ఆర్ కె నాయుడు పాత్ర చాలా పవర్ ఫుల్ రోల్ . పోలీసు ఇనస్పెక్టర్ గా పవర్ ఫుల్ గా, గంభీరంగా చేసిన నటన హైలెట్ గా నిల్చింది. అందుకే టివి సీరియల్స్ లో పోలీస్ పాత్రకు సాగర్ పెట్టింది పేరుగా నిలిచాడు.

నెలలో 28రోజులు సీరియల్ షూటింగ్ లోనే సాగర్ ఉండేవాడట. షూటింగ్ లో ఎంతో నిబద్దతతో నటించేవాడట. మిగిలిన రెండు రోజులూ కూడా ఆపాత్రల్లోనే నిమగ్నమై ప్రాక్ట్స్ చేసేవాడట. అందుకే ఆరేళ్ళు బయట ప్రపంచానికి దూరం కావాల్సి వచ్చిందని అంటాడు. అందుకే బుల్లితెర స్టార్ హీరో అయ్యాడు. ‘సాగర్ లాంటి నటుడిని ఇంతవరకూ చూడలేదు . ఎన్నో ప్రత్యేకతలున్నాయి’అని డైరెక్టర్ మంజుల నాయుడు చెప్పారు.