Movies

పాతికేళ్ల తర్వాత విడాకులు తీసుకోవటానికి బయట పడ్డ అసలు కారణం… సినీ పరిశ్రమ షాక్

సామాన్యులైనా,సెలబ్రిటీలైనా సరే, దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు వస్తే,అవి పెద్దగా మారిపోయి విడాకుల వరకూ వెళ్తాయి. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అని తేలిపోతున్నాయి. ఇక నటి లిజి,ప్రియదర్శన్ ల విడాకుల వ్యవహారం కూడా విస్మయానికి గురిచేస్తుంది. తెలుగులో నాగార్జున తో కల్సి నిర్ణయం,బాలయ్యతో కల్సి గాండీవం మూవీస్ ని ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు. మోహన్ లాల్ తో కల్సి మలయాళంలో సినిమా చేసాడు.

కాగా 1990డిసెంబర్ 13న లిజి,ప్రియదర్శన్ ల ప్రేమ వివాహం జరిగింది. హిందూ కేథలిక్ నుంచి హిందూ మతంలోకి మారిపోయి,తన పేరును లక్ష్మీగా మార్చుకుంది. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సిద్ధార్ధ్,కూతురు కళ్యాణి ప్రియదర్శన్ . హలొ చిత్రంలో అఖిల్ తో కల్సి కళ్యాణి నటించింది. దాదాపు పాతికేళ్ళు కల్సి కాపురం చేసిన లిజి,ప్రియదర్శన్ లకు 2016లో బ్రేక్ పడింది. 2014లోనే లిజి చెన్నై ఫామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు వేసింది.

సిన్మాలు వదిలేసి,వ్యాపారాలపై దృష్టిపెట్టడంతోనే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. కేరళ క్రికెట్ జట్టుకి లిజి తల్లి మేనేజర్ గా కూడా ఉంది. దీంతో లిజి,ప్రియదర్శన్ లకు గొడవకు ఇది కూడా ఓ కారణం అయింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేసాయి. చెన్నైలో ఫోర్ ఫ్రేమ్స్ స్టూడియో వ్యవహారాలు చూస్తూ,80కోట్లు షేర్ ఇవ్వాలని అడిగింది. దీంతో పరిస్థితి విడాకుల వరకూ పోయిందని అంటారు. అంతేకాకుండా ప్రియదర్శన్ కి ఓ నటితో గల సంబంధమే లిజి కోపానికి కారణంగా చెబుతుంటారు.