Movies

కృష్ణంరాజుకు ప్రభాస్ పెట్టిన ముద్దు పేరును బయటపెట్టిన శ్యామల… ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పేసింది

టాలీవుడ్ లో తన నటనతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఆయన విజయంలో భార్య శ్యామలాదేవి పాత్ర కూడా ఎంతోఉంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో భర్త కృష్ణంరాజు గురించి ,అలాగే ప్రభాస్ గురించి శ్యామలాదేవి సంచలన విషయాలు వెల్లడించారు.ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుని పెద్ద బాజీ అని పిలుస్తాడని,తనను కన్నమ్మ అని ప్రేమగా పిలుస్తాడని ఆమె చెప్పింది. మా ఫోన్ నెంబర్లు కూడా అతడి మొబైల్ లో ఈ పేర్లతోనే ఫీడ్ అయ్యివుంటాయని చెప్పుకొచ్చారు.

కృష్ణంరాజుకు కూడా ప్రభాస్ అంటే చాలా ప్రేమ అని శ్యామల దేవి చెప్పారు. ‘ఇన్నాళ్లూ మీరు కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతిగా ఉండండి. మిమ్మల్ని చూసుకోడానికి నేనున్నాను కదా”అని ప్రభాస్ తన పెదనాన్నతో ఎన్నో సార్లు చెప్పాడట. అయినా సరే,నిరంతరం సినిమాలు తీయాలని తపిస్తారని,రిటైర్ మెంట్ అనేది ఒప్పుకోరని శ్యామలాదేవి అంటున్నారు. అంతేకాదు , కృష్ణంరాజు ఓ మాట చెబితే దాన్ని తిరస్కరించే సాహసం ప్రభాస్ చేయలేడని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

ఇక తమకున్న ముగ్గురు కూతుళ్లతో కూడా ప్రభాస్ చాలా ప్రేమగా ఉంటాడని,సొంత చెల్లెళ్ళ కన్నా ఎక్కువగా చూస్తాడని శ్యామలాదేవి చెప్పారు. ముగ్గురు పిల్లలను పెంచడం కన్నా భర్త కృష్ణంరాజుని పెంచడమే చాలా కష్టంగా మారిందని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన పసిపిల్లవాడి మనస్తత్వం అని,అందుకే ఆయనను వదిలిపెట్టి పుట్టింటికి కూడా వెళ్లలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ 39ఏళ్ళ వయస్సులో ఉండడం , పెళ్లి గురించి రకరకాల కథనాలు రావడం నేపథ్యంలో ఆమె స్పందిస్తూ వరల్డ్ అంతటా ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి జాన్ మూవీ తర్వాత ఖాయంగా ఉంటుందని చెప్పారు.