మెగా ఫ్యాన్స్ మధ్య ప్రశాంత్ కిషోర్ చిచ్చు పెట్టేసాడా…???
రాజకీయాలు ఒక్కోసారి మంచి రసవత్తరంగానే ఉంటాయి. ఎవరు ఎవరికి మిత్రులో,ఎవరు శతృవులో చెప్పలేం. ప్రస్తుతం ఏపీలోని పాలిటిక్స్ అలానే ఉన్నాయి. టిడిపి తో కంటే, వైఎస్సార్సీపీ కి జనసేన తోనే జకీయ యుద్ధం కొనసాగుతుంద న్నట్లు వాతావరణం వుంది. వైసీపీ నేతలు, అభిమానులు అయితే జనసేన ని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని చెప్తూనే నిరంతరం ఆ పార్టీ జపమే చేస్తున్నారు. పవన్ ఏ తప్పు మాట్లాడాడు, దాన్ని ఎలా వక్రీకరించి జనాల్లోకి తీసుకెళ్లాలి అన్నది ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి ప్రచారం కొంచెం జోరుగానే నడుస్తోంది.
అయితే దీనంతటికి ప్రధాన కారణం వైసిపి విజయానికి కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ హస్తం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా అవ్వడానికి ఎక్కడి నుంచి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ ను హైర్ చేసుకున్నారు.అయితే జగన్ ను ముఖ్యమంత్రి చేసేంత వరకే వారి పని అనుకంటే పొరపాటే, నిజానికి వారిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఇంకా కొనసాగుతోందట. అలా ప్రశాంత్ కిషోర్ కు ఉన్న ఐప్యాక్ బృందమే ఈ మధ్య కాలంలో జనసేన పై జరుగుతున్న విష ప్రచారానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం మెగా ఫ్యాన్స్ నే టార్గెట్ చేసుకున్నారని వారి అభిమానుల్లా కొన్ని ఫేక్ అకౌంట్స్ చేసుకొని కొంతమంది జగన్ కు సపోర్ట్ గా మాట్లాడ్డం మొదలుకొని అటు పవన్, చిరు అభిమానుల్లో గొడవలు రేగేలా ఒకే కుటుంబానికి చెందిన వారు ఇంకొకరికి ఎందుకు సపోర్ట్ చెయ్యకూడదు అనేట్టుగా అంతర్గత కలహాలు తీసుకొని రావడమే లక్ష్యం గా ఎంచుకున్నట్లు టాక్. మెగా ఫ్యామిలీలోనే కొందరు చిరు ఫోటో పెట్టుకొని చరణ్ ఫోటో పెట్టుకొని జగన్ కు మద్దతుగా ఉంటారు.దాన్ని చూసి మిగతా వారి మధ్యలో చిచ్చు మొదలవుతుంది.ఇలా మెగా ఫ్యాన్స్ ను టార్గెట్ చేసారని ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది.