సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం మొత్తం టాలీవుడ్ కే ఆదర్శం…ఎందుకో తెలుసా?
తెలుగు చరిత్రలో ఎన్టీఆర్,అక్కినేనిలను సైతం ఒకానొక దశలో మించిపోయి మాస్ హీరోగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ కృష్ణ 350కి పైగా చిత్రాల్లో హీరోగా చేసాడు. ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనెమనసులు మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి,హీరోగా, నిర్మాత,దర్శకుడిగా తన సత్తాచాటాడు. ఓ సినిమా నష్టపోతే తదుపరి సినిమాలు ఉచితంగా చేసి పెట్టి,మనసున్న మనిషిగా నిరూపించుకున్న హీరో కృష్ణ.
మనిషే కాదు మనసూ అందమేనని నిరూపించుకున్న కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఉండగానే నటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లాడాడు. ఈమెతో సంసారం చేస్తున్నా సరే, పిల్లలను కనలేదు. అదేసమయంలో ఇందిరాదేవితో కాపురం కొనసాగిస్తూ పిల్లలను కన్నారు. ఇలా ఇందిరను కూడా కృష్ణ ప్రేమించాడు. పెద్ద కొడుకు రమేష్ బాబుని ఇండస్ట్రీకి తెచ్చారు. కొన్ని సినిమాలతో పాపులర్ అయినప్పటికీ నిలబడలేకపోయాడు. దాంతో బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన చిన్న కొడుకు మహేష్ బాబుని రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇప్పించాడు.
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్ స్టార్ గా మహేష్ ఎదిగాడు. దీంతో కృష్ణ లో సంతోషం పెల్లుబికుతోంది. ఇక తన పెద్ద కుమార్తె పద్మావతిని ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ కి ఇచ్చి పెళ్ళిచేసాడు. జయదేవ్ రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండో కుమార్తె మంజులను సంజయ్ కి ,మూడో కుమార్తె ప్రియదర్శిని సుధీర్ బాబుకి ఇచ్చి పెళ్లి చేసాడు. యితడు కూడా పలు సినిమాల్లో చేస్తున్నాడు. రెండో కుమార్తె మంజుల ప్రస్తుతం నిర్మాతగా,నటిగా కూడా టాలీవుడ్ లో కొనసాగుతోంది.