ఎంతో స్నేహంగా ఉండే వీరి మధ్య మనస్పర్థలకు ఒకే ఒక సినిమా కారణం
సినిమాల్లో కొన్ని జంటలు స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. అందులో నందమూరి బాలకృష్ణ,లేడి అమితాబ్ విజయశాంతి జంట ఒకటి. వీరిద్దరూ కల్సి 17సినిమాల్లో చేసారు. తెరవెనుక కూడా వీళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది. బాలయ్య హీరోగా విజయశాంతి సినిమా తీసేంతగా వీరిద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ నడిచింది. అయితే అలా బాలయ్య తో తీసిన సినిమాయే ఇద్దరి మధ్యా రగడకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే, 1992లో భర్త శ్రీనివాస ప్రసాద్ తో కల్సి బాలయ్యతో విజయశాంతి ఓ సినిమా స్టార్ట్ చేసింది. అప్పట్లో నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. దాంతో రిలీజ్ బాగా లేటయింది. 1993సెప్టెంబర్ 3న విడుదలైన ఈ సినిమా పేరు నిప్పురవ్వ . అప్పట్లో ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది. బయ్యర్స్ ఎక్కువ రేటుకి కొన్నారు. అయితే బాలయ్య ఈ సినిమా తర్వాత షూటింగ్ ప్రారంభించిన బంగారు బుల్లోడు మూవీ కూడా అదే సమయానికి విడుదలకు సిద్ధమైంది.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ రాజేంద్రప్రసాద్ ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి తగ్గడు. ఎవరి మాటా వినడు. అక్కినేని సైతం ఆయన మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. దాంతో సినిమా రిలీజ్ వాయిదా వేయమని స్వయంగా విజయశాంతి అడిగినా ఆయన నో అనేశాడు. బాలయ్య కూడా ఏమీ చేయలేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ఇందులో బంగారు బుల్లోడు హిట్ కొట్టి,నిప్పురవ్వ ప్లాప్ తో విజయశాంతికి భారీ నష్టాన్ని మిగిల్చింది. బాలయ్య నుంచి ఎలాంటి తప్పులేకున్నా,ఈ సినిమా తర్వాత మళ్ళీ విజయశాంతి మాత్రం బాలయ్యతో కల్సి నటించలేదు. తర్వాత ఇద్దరూ కలుసుకున్నా అంతకుముందున్న రిలేషన్ మాత్రం కనిపించలేదు.